ఆఖరి దశలోనూ పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు
న్యూఢిల్లీ: లోక్‌సభకు ఆదివారం జరిగిన చివ రి విడత, 7వ దశ ఎన్నికల్లో 64 శాతం పోలింగ్ నమోదయింది. 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 59 నియోజకవర్గాలకు ఈ చివరి విడత ఎన్నికలు జరిగాయి. ఈ దశ ఎన్నికల్లో 918 అభ్యర్థుల విధి తెలియనుంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఈ చివరి విడత ఎన్నికల బరిలో ఉన్నారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, చండీగఢ్‌లలో ఈ చివరి విడత ఎన్నికలు జరిగాయి. 10.01 కోట్లకు పైగా ఓటర్లు ఈ ఎన్నికల్లో అర్హులుగా ఉన్నారు. ఎన్నికల సంఘం దాదా పు 1.12 లక్షల పోలింగ్‌బూత్‌లను ఏర్పాటుచేసింది. ఎన్నికలు సజావుగా జరగడానికి భద్రత ఏర్పాట్లు కూడా కట్టుదిట్టం చేసింది. ఈ చివరి విడత ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు, పంజాబ్‌లో ఘర్షణలు జరిగినట్లు వార్తలు అందాయి. ఈ విడతలో పంజాబ్‌లో 13 స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లో 13, పశ్చిమబెంగాల్‌లో 9, బీహార్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 8, హిమాచల్‌ప్రదేశ్‌లో 4, జా ర్ఖండ్‌లో 3, చండీగఢ్‌లో ఒక్క స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లో 55.52 శా తం ఓటింగ్ నమోదయిందని, వారణాసిలో 53.58 శాతం, గోరఖ్‌పూర్‌లో 56.47 శాతం పోలింగ్ నమోదయినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. చందౌలీ లోక్‌సభ నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థి మహేంద్ర నాథ్ పాండే మళ్లీ ఎన్నికయ్యేందుకు పోటీపడుతున్నారు. ఇక్కడ బిజెపి, సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు ఘర్షణలకు దిగారు. తర్వాత పరిస్థితిని నియంత్రణలోకి తెచ్చారు. అలీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారా జీవన్‌పూర్ గ్రామంలో దళితులు ఓట్లు వేయకముందే వారి వేళ్లకు ఇంకు వేశారని వార్తలు అందాయి. ఈ విషయంలో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్లు వార్తలు అందాయి. ఈ విడతలో ఇక్కడ తొమ్మిది లోక్‌సభ స్థానాలకు 1.49 కోట్ల ఓటర్లలో 73.40 శాతం మంది ఓటేశారని తెలిసింది. కోల్‌కతాలోని గిరీశ్ పార్క్ సమీపంలో మధ్యాహ్నం ఓ నాటు బాంబును విసిరిన సంఘటన చోటుచేసుకుందని ఉత్తర కోల్‌కతా బిజెపి అభ్యర్థి రాహుల్ సిన్హా తెలిపారు. కాగా ఈ ప్రాంతంలో టపాసులు కాల్చారని, పోలింగ్ ప్రశాంతంగానే జరిగిందని పోలీసులు చెప్పారు. దక్షిణ కోల్‌కతాలో తనను పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించనివ్వకుండా అడ్డుకున్నారని టిఎంసి అభ్యర్థి మాలా రాయ్ చెప్పారు. కోల్‌కతా, దాని పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ ఘర్షణలు జరిగాయని సమాచారం. పోలింగ్ బూత్ వెలుప ఓటర్లను కేంద్ర బలగాలు బెదిరించాయని టిఎంసి కార్యకర్తలు వాదించారు. బడ్జ్‌బడ్జ్ ప్రాంతంలో తన కారును ధంసం చేసినట్లు డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న బిజెపి అభ్యర్థి నీలాంజన్ రాయ్ చెప్పారు. ఇదేవిధంగా జాదవ్‌పూర్‌లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బిజెపి అభ్యర్థి అనుపం హజ్రా కారుపై దాడి చేసినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ పశ్చిమ బెంగాల్‌లోని తొమ్మిది నియోజకవర్గాల్లో పోలింగ్ చాలా వరకు ప్రశాంతంగానే జరిగిందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని ఎన్నికల అధికారి పిటిఐ వార్తా సంస్థ విలేకరికి చెప్పారు.