చారిత్రక సన్నివేశం

పార్లమెంట్‌ ఉభయసభల్లో ఆశీనులైన సభ్యులు
సోమవారం ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న వేళ పటిష్ట నిబంధనల మధ్య పార్లమెంట్‌ వర్షాకాలు సోమవారం ప్రారంభమయ్యాయి. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సమావేశాలకు హాజరైన లోక్‌సభ సభ్యులు రాజ్యసభలో కూడా కూర్చున్నారు. కాగా, భౌతిక దూరం మార్గదర్శకాలను అమలు చేసే భాగంలో లోక్‌సభ సభ్యులు రాజ్యసభలో కూర్చునేందుకు, రాజ్యసభ సభ్యులు లోక్‌సభలో కూర్చునేలా అనుమతించేందుకు లోక్‌సభ నియమ నిబంధనలను సడలించినట్లు స్పీకర్‌ ఓమ్‌బిర్లా చెప్పారు. సోమవారం లోక్‌సభ 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సమావేశం కాగా, రాజ్యసభ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సమావేశమైంది. మంగళవారం నుంచి రాజ్యసభ ఉదయం, లోక్‌భ మధ్యాహ్నం భేటీ కానుంది. సడలించిన లోక్‌సభ నియమనిబంధనల్లో భాగంగా సభ కార్యకలాపాలు జరిగేపటప్పు డు ఉభయ సభల చాంబర్లు, గ్యాలరీల్లో కూడా సభ్యులు కూర్చోనున్నట్లు స్పీకర్‌ చెప్పా రు. ఇలాంటి ఏర్పాట్లు చేయడం పార్లమెంట్‌ చరిత్రలోనే బహుశ మొదటిసారి అయి ఉండవచ్చని ఓమ్‌ బిర్లా పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి ని అరికట్టేందుకు తయారు చేసిన కొత్త నిబంధనల్లో భాగంగా సభ్యులు మాట్లాడేటప్పుడు తమ సీట్లోను నుంచి ఎవరు కూడా లేవ కూడదని బిర్లా చెప్పారు. అయితే కూర్చొని మాట్లాడం సభ్యులకు కొంత క్లిష్టంగానే ఉంటుందని తాము గుర్తించామన్నారు. కాగా, దాదాపు 200 మంది సభ్యులు లోక్‌సభ చాంబర్‌లో కూర్చోగా, 50 మందికిపైగా విజిటర్స్‌ గ్యాలరీలో ఆశీనులయ్యారు. అయితే 9 గంటలకు సభ ప్రారంభమయ్యే సమయానికి తక్కువ మంది సభ్యులు మాత్రమే సభకు హాజరయ్యారు. కానీ, ఇటీవల మృతి చెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఓ సిట్టింగ్‌ ఎంపి, మరో 13 మంది మాజీ సభ్యులకు నివాళి అర్పించిన తరువాత సభ గంటసేపు వాయిదా పడి అనంతరం సమవేశమైనప్పుడు సభ్యుల సంఖ్య పెరిగింది. గతంలో మాదిరిగా ఈసారి ప్రతిపక్షాలు వెల్‌లోకి వెళ్లి నిరసనలు తెలపలేదు. మిగతాదం తా సభ సమావేశమైన వెంటనే ఎప్పటిలాగే సభ జరిగింది. చాలా తక్కువ మంది లోక్‌సభ సభ్యులు మాత్రమే రాజ్యసభ చాంబర్‌లో ఆశీనులైనట్లు లోక్‌సభ చాంబర్‌లో ఉన్న టివిల్లో కనిపించింది. సాధారంగా ఒక బెంచ్‌లో ఆరుగురు సభ్యులు కూర్చోవాల్సి ఉండగా, భౌతిక దూరం నేపథ్యంలో ముగ్గురు మాత్రమే కూర్చున్నారు. కరోనా బారిన పడకుండా సభ్యులను రక్షించేందుకు వారు కూర్చున్న బెంచ్‌లకు గ్లాస్‌ వంటి ప్లాస్టిక్‌ షీల్డ్‌లను ఏర్పాటు చేశారు. స్పీర్‌ పోడియానికి ఎడమవైపు ఉన్న ట్రెజరీ బెంచ్‌ల్లోని ముందు సీట్లలో ప్రధాని మోడీ కూర్చోగా ఆ సీట్‌కు నెంబర్‌ వన్‌ అని రాశారు. అలాగే రెండవ నెంబర్‌లో రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, మూడవ నెంబర్‌లో వ్యవసాయశాఖమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌లు ఆశీనులయ్యారు. కాగా, ప్రతిపక్ష బెంచ్‌ల్లోని ముందు సీట్లలో టిఎంకె సభ్యుడు టిఆర్‌బాలు, కాంగ్రెస్‌పక్షనేత అధీర్‌ రంజన్‌ చౌదరీలు కూర్చున్నారు. ఆర్టికల్‌ 370 రద్దు తరువాత మొదటిసారిగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యారు. ఆయన ప్రతిపక్ష బెంచ్‌ల్లోని రెండవ వరుసలో కూర్చున్నారు. ఇదిలా ఉండగా, ప్రధాని సభలోకి ప్రవేశించగానే సభ్యులు ‘భారత్‌ మాతాకి జై’ అంటూ చప్పట్లతో స్వాగతం చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు కూడా చేతులు జోడించి మోడీకి స్వాగతం పలికారు. సభ్యులుందరూ మాస్కులు ధరించారు. కొంతమంది ఫేస్‌ షీల్డ్‌ను కూడా వేసుకున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?