మధ్యప్రదేశ్‌లో బిజెపి మొదటి లిస్ట్‌ కలకలం

భోపాల్‌ : చెప్పుకోదగ్గ విశ్వాసంతోనే బిజెపి తన మొట్ట మొదటి అభ్యర్ధుల జాబితాను 177 మందితో ప్రకటించిం ది. రాష్ట్ర వ్యాపితంగా ఎలాంటి తిరుగుబాటుకూ అవకా శంలేదని కొట్టిపారేసింది. 38 మంది సిట్టింగ్‌ ఎంఎల్‌ఎల కు పార్టీ, టిక్కెట్లను నిరాకరించింది. దీనర్ధం, దాదాపు మూడవవంతు శాసనసభానియోజక వర్గాల్లో కొత్తముఖా లు కనబడతాయి. కాంగ్రెస్‌లో లాగా, ముఖ్యమైన నాయ కుల నేతృత్వంలో ముఠాలుగా విడిపోయే పరిస్థితి బిజెపి లో లేకపోవడం సానుకూలాంశం. అభ్యర్ధుల జాబితాను విశ్లేషిస్తే వారంతా చాలావరకు ముఖ్యమంత్రి శివరాజ్‌సిం గ్‌ చౌహాన్‌ ఆమోదముద్ర ఉన్నవారే. 230 ని యోజక వర్గాలకు 177 మంది అభ్యర్ధులను పార్టీ ప్రక టించింది. మిగిలిన 53 అభ్యర్ధులను త్వరలో ప్రకటిస్తా రు. 2013 శాసనసభ ఎన్నికల్లో ఈ 177 నియోజక వర్గా ల్లో 126లో బిజెపి విజయం సాధించింది. టిక్కెట్లు నిరాక రించిన వారిలో మాయాసింగ్‌ ఉండటం విశేషం. ఎందు కంటే ఆమె పూర్వపు గ్వాలియర్‌ రాచరిక కుటుంబానికి చెందిన వ్యక్తి. జాబితాలో భోపాల్‌ నియోజక వర్గాలు కూడా ఉన్నాయి. ఇక్కడున్న ఐదు నియోజక వర్గాలలో నలుగురు సిట్టింగ్‌ ఎంఎల్‌ఎలకు టిక్కెట్లు కేటా యించారు. ఐదవ సీటుకు మాజీ ముఖ్యమంత్రి బాబూలా ల్‌ గౌర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దానిని ఎటూ తేల్చ కుండా అట్టేపెట్టారు. ఆయన 88వ పడిలోకి ప్రవేశించి నా, ఇప్పటికి 10 సార్లు ఎంఎల్‌ఎగా గెలిచినా, ఆయన తిరిగి పోటీ చేసేందుకు సంసిద్ధత ప్రకటించి ఉన్నారు. ఆ యన 11వ సారి పోటీకి సమ్మతించడం దాదాపు అసా ధ్యం. నుండి ఆయన్ను బర్తరఫ్‌ చేసిన నాటి నుండి ఆయన ప్రతిపక్ష నాయకుడిలా వ్యవహరిస్తున్నారు. విధానసభ లోపల, బయటా ప్రభుత్వాన్ని ఎండగట్టేందు కు ఆయన ఏ అవకాశాన్నీ వదులుకోవటంలేదు. అయితే తన టిక్కెట్‌ నిరాకరించే పరిస్థితుల్లో తన కోడలు భోపాల్‌ మాజీ మేయర్‌ కృష్ణగౌర్‌కు ఇవ్వాలని, ఆమె బిజెపి రాజ కీయాల్లో చాలా చురుకుగా ఉంటున్నారని అన్నారు.అదే విధంగా ఇండోర్‌ నుండి కొన్ని సీట్లకు సంబంధించి నిర్ణ యం ప్రకటించలేదు. దానికి కారణం లోక్‌సభస్పీకర్‌ సుమిత్రామహాజన్‌, బిజెపి ప్రధాన కార్యదర్శి కైలాష్‌ విజ యవర్గీయ్‌ల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. కైలాష్‌ ఇండోర్‌ జిల్లా నుండి ప్రస్తుతం ఎంఎల్‌ఎగా ఉన్నారు. బాబూలాల్‌ గౌర్‌తోపాటు ఒకే ఒక సిక్కు ఎంఎల్‌ఏ సర్తాజ్‌ సింగ్‌ను కూడా మంత్రి వర్గం నుండి తప్పుకోమని ఆదేశించారు. ఆయన వయసు 75. అయినప్పటికీ ఆయ న కూడా విధాన సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయన క్కూడా టిక్కెట్‌ దొరికే పరిస్థితి కనబ డటంలేదు. అలాగే 75 సంవత్సరాలు దాటిన మరికొంద రు మంత్రులకు కూడా టిక్కెట్‌ లభించకపోవచ్చు. టిక్కెట్లు ప్రకటించిన వెంటనే చిన్నసైజు తిరుగుబాటు ప్రారంభమై నట్లు కొన్ని ప్రాంతాల నుండి వార్తలు భోపాల్‌కు చేరు కున్నాయి. అలాంటి వార్తల్లో ఒకటి నీముచ్‌ జిల్లా మానస నుండి మాధవ్‌ మరును నిలబెడుతున్నట్లు తెలియగానే కైలాష్‌ చావ్లా అనుచరులు నిరసనలు ప్రారంభించారు.
గతంలో 2013లో మరు ఇదే స్థానం నుండి స్వతంత్య్ర అభ్యర్ధిగా పోటీ చేసి సుమారు 30వేల ఓట్లు పొంది మూడవ స్థానంలో నిలిచారు. ముగ్గురు సిట్టింగ్‌ ఎంఎల్‌ఎలకు పార్టీ టిక్కెట్లు ఇచ్చింది. వారు గతంలో స్వ తంత్య్ర అభ్యర్థులుగా గెలిచి, తరువాత బిజెపిలో చేరారు. ఇద్దరు లోక్‌ సభ సభ్యులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఎప్పటిలాగే ముస్లింలు ఎవరూ ఈ జాబితాలో లేరు. త్వర లో ప్రకటించబోయే 53 మంది జాబితాలో సైతం ముస్లిం లు ఎవరైనా ఉంటారన్నది అనుమానమే. ఇదిలాగుంటే, కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్లమెంటు మాజీ సభ్యుడు ప్రేంచంద్‌ గుడ్డూ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిపోయారు. ఉజ్జయిన్‌ నుండి పోటీ చేసేందుకు తనకు టిక్కెట్‌ నిరాకరించారని తెలుసుకున్న వెంటనే ఆయన కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. గుడ్డూను దిగ్విజయ్‌సింగ్‌కు విశ్వసనీయ అనుచరుడుగా చెబు తారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చౌహాన్‌ బావమరిది బిజెపికి గుడ్‌బైచెప్పి కాంగ్రెస్‌లో చేరారు.

DO YOU LIKE THIS ARTICLE?