హైదరాబాద్ : ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు లీడర్ కాదని, మేనేజర్ అని, చంద్రబాబు ఒక డర్టీయెస్ట్ పొలిటీషియన్ అని, ఆయన తరహాలో దేశంలోనే ఎవరూ లేరని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు రాజకీయం ‘యూజ్ అండ్ త్రో’ లాంటిదని, ఆయనొక పచ్చిస్వార్థపరుడని, ఎంతకైనా దిగజారుతారని, ఇతరులను వాడుకుని వదిలేస్తారని కెసిఆర్ ఆరోపించారు. ఎపిలో విపరీతమైన అవినీతి ఉందన్నారు. కాంగ్రెస నేతలు ఇడియట్స్ అని, బిసి రిజర్వేషన్లపై కోర్టులో వారే కేసులు వేసి, తిరిగి వారే బిసిలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని కెసిఆర్ విమర్శించారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపిలను ప్రజలు గోరంగా తిరస్కరించినా వారికి బుద్ది రావడం లేదని విమర్శించారు. ప్రగతి భవన్‌లో శనివారం కెసిఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సిగ్గులేకుండా, నీచ రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబుకు తాను ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అద్భుతంగా ఉంటుందన్నారు. కేంద్రంలో ఎప్పుడూ చంద్రబాబు చక్రం తిప్పలేదని, ఆయనకు మొదటి నాలుగు ముక్కలు ఇంగ్లీషు, హిందీ కూడా మాట్లాడడం రాదని ఎద్దేవా చేశారు. ఎపిలో చంద్రబాబు ఘోరాది ఘోరం గా ఓడిపోవడం ఖాయమని, ఆ పార్టీ ప్రజల తిరస్కరణకు గురికాక తప్పదన్నారు. ఏది పడితే అది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని బాబు అనుకుంటారని, ఆయనకు డబ్బా కొట్టేందుకు రెండు పేపర్లు ఉన్నాయని విమర్శించారు. అర్థం పర్థం లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. డిసెంబర్ నాటికి హైకోర్టును ఏపీలో ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎపి ప్రభుత్వమే సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో స్పష్టం చేసిందని, అయితే తాము మాత్రం హైకోర్టు విభజన జరిగితే చాలని, ఇక్కడే రెండు కోర్టులు ఉన్నా తమకు అభ్యంతరం లేదని తమ అఫిడవిట్‌లో స్పష్టం చేశామని ఆయన వివరించారు. హైకోర్టును విభజించాలని సుప్రీంకోర్టు తీర్పునిస్తే దానిని కేంద్ర ప్రభుత్వం నోటిఫై మాత్రమే చేసిందని, అలాంటిది చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. హైకోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ 5వందల కోట్లు నిధులు ఎక్కడికి పో యాయని, నాకేశారా అని ప్రశ్నించారు. తాము ఎవరిని కలిస్తే చంద్రబాబుకు ఏమటని ప్రశ్నించారు. నాలుగేళ్ల పాటు ప్రధాని మోడీకి డబ్బా కొట్టి, ఇప్పుడు రాహుల్ గాంధీ పక్కన చేరారని, చంద్రబాబును చూసిప్రజలు సిగ్గుపడాలన్నారు. ఏ మొహం పెట్టుకుని నరేంద్ర మోడీ ఏపీకి వస్తున్నారని ప్రశ్నించిన చంద్రబాబు, గతంలో రాహుల్ గాంధీని కూడా ఇలాగే తప్పులు పట్టారని గుర్తు చేశారు.
చంద్రబాబు డర్టీ పొలిటీషియన్!
RELATED ARTICLES