చంద్రయాన్‌ ముచ్చట వచ్చే ఏడాదే

న్యూఢిల్లీ : చంద్రయాన్‌ ప్రయోగం వచ్చే ఏడాదికి వాయిదాపడింది. కరోనా మహమ్మా రి, లాక్‌డౌన్‌ కారణంగా చంద్రయాన్‌- సహా అనేక ఇస్రో ప్రాజెక్టులు అపరిష్కృతంగా ఉండిపోయాయని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ కె.శివన్‌ చెప్పారు. నిర్ణీత ప్రకారం 2020లోనే చంద్రయాన్‌- ప్రయో గం, దేశ తొలి వ్యోమగాముల అంతరిక్షయా త్ర జరగాల్సి ఉంది. కానీ ఇంతకుముందులాగా చంద్రయాన్‌ ప్రయోగం అంటే అది కక్ష్యలోకి తిరుగుతూ ఉంచటం కాదని, గగనయాన్‌ విజయవంతానికి ఇస్రో కృషి చేస్తోందని అన్నారు. చంద్రయాన్‌- తరహాలోనే గగనయాన్‌ రూపురేఖలు, సమగ్రాకృతి ఉంటాయ ని, అయితే చంద్రయాన్‌- కు ఉపయోగించిన కార్యక్షేత్రాన్నే దీనికీ ఉపయోగిస్తామని, దాం తోనే ఈ వ్యవస్థను రూపుదిద్దేందుకు కృషి చేస్తున్నామని, అందువల్ల 2022 నాటికి చంద్రయాన్‌-3 ప్రయోగం పూర్తిచేస్తామని శివన్‌ చెప్పారు. ఇంతవరకు ఎవరూ వెళ్ళని ప్రాంతంలో ఆర్బిటార్‌ ద్వారా చంద్రమండలం దక్షిణ ధృవంమీద రోవర్‌ను ప్రవేశపెట్టే ఉద్దేశంతోనే దుకే శక్తిమంతమైన జిఎస్‌ఎల్‌వి ద్వారా 2019 జూలై 22న చంద్రయాన్‌-2 ప్రయోగం చేశామని గుర్తు చేశారు. ఆగస్టు 20 నాటికి చంద్రయాన్‌-2 చంద్రడి కక్ష్యలోకి ప్రవేశించి పౌర్ణమి రోజున 2019 సెప్టెంబరు 7వ తేదీన విక్రమ్‌ రోవర్‌ను చంద్రమండలం దక్షిణ ధృవంలో జారవిడిచింది. అయితే దుదృష్టవశాత్తూ అది బోల్తా కొట్టడంతో భారత్‌ కలలు కల్లలయ్యాయి. మొదటి ప్రయత్నంలోనే 95 శాతం విజయవంతంగా రోవర్‌ ల్యాండర్‌ను చంద్రుడి ఉపరితలంమీదకు ప్రవేశపెట్టేందుకు కృషి చేశామని శివన్‌ చెప్పారు. అయితే వీటన్నింటికీ భిన్నమైనది చంద్రయాన్‌-3, ఎందుకంటే భారతదేశ శక్తిసామర్ధ్యాలను నిరూపించే గగనయాన్‌ ప్రయోగం ఎంతో సంక్లిష్టమైనది, భవిష్యత్‌లో గ్రహాంతర స్థాయిలో సామర్థ్య నిరూపణకు ఇది నాంది కాగలదని అన్నారు. గగనయాన్‌ ప్రాజెక్టు కింద మానవ రహిత ప్రయోగాన్ని డిసెంబరులో చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వాస్తవానికి గడచిన డిసెంబరులోనే ఇది పూర్తికావాల్సి ఉందని అన్నారు. దీని తర్వాత మరోసారి కూడా మానవరహిత ప్రయోగం చేశాక మూడో దశలో గగనయాన్‌ ద్వారా 2022లో ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి భారత్‌ ప్రవేశపెడుతుందని, వారు ముగ్గురూ ప్రస్తుతం రష్యాలో శిక్షణ పొందుతున్నారని శివన్‌ చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?