మహిళల ప్రపంచ బాక్సింగ్‌లో
నిఖత్ జరీన్‌కు టైటిల్
న్యూఢిల్లీ: హైదరాబాద్ సంచలన మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ విశ్వవిజేతగా నిలిచింది. ఇస్తాంబుల్‌లో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ మహిళల 52 కిలోల విభాగంలో భారత్‌కు పసిడి పతకాన్ని సంపాదించింది పెట్టింది. గతంలో ప్రపంచ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న జరీన్ ఈ పోటీల్లో తనపై అభిమానులు పెట్టుకున్న అంచనాలను వమ్ము చేయలేదు. సెమీ ఫైనల్లో బ్రెజిల్ బాక్సర్ అల్మెడాను 5 0 తేడాతో చిత్తుచేసి ఆమె ఫైనల్లో థాయిలాండ్‌కు చెందిన జింపాంగ్ జుటామస్‌తో తలపడింది. మొదటి రౌండ్ నుంచే ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తిరుగులేని పంచ్‌లు, బలమైన హుక్స్‌తో ప్రత్యర్థిని చిత్తుచేసి, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకాన్ని సగర్వంగా అందుకుంది. మన దేశంలో నుంచి మేరీ కోమ్ అత్యధికంగా ఆరు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను సాధించింది. ఆమెతోపాటు దేశానికి స్వర్ణపతకాలు అందించిన సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, కెసి లేఖ జాబితాలో జరీన్ చోటు దక్కించుకుంది.
గోల్డెన్ పంచ్
RELATED ARTICLES