ప్రజాపక్షం / హైదరాబాద్ అంతర్జాతీయ విద్యార్థి సంఘం మాజీ సెక్రెటరీ జనరల్, అఖిల భారత యువజన, విద్యార్థి ఫెడరేషన్ వార పత్రిక ‘యూత్ లైఫ్’ మాజీ సంపాదకులు కామ్రేడ్ ఎస్.గుణాలన్ చెన్నై నగరంలో బుధవారం మరణించారు. ఆయన విద్యార్థిగా ఉండగా చెన్నైలో ఎఐఎస్ఎఫ్ నాయకుడిగా ఎన్నికై అనేక ఉద్యమాలు, పోరాటాలు చేశారు. 1971 నుండి 78 వరకు ఢిల్లీ కేంద్రంలో అఖిలభారత విద్యార్థి,యువజన సమాఖ్యల బాధ్యతలు నిర్వహించారు. సమర్థవంతంగా యూత్ లైఫ్ పత్రికను నడిపించారు. 1979 నుండి 85 వరకు అంతర్జాతీయ విద్యార్థుల సంఘం సెక్రెటరీ జనరల్‌గా ఉన్నారు. మాస్కో, ప్రేగ్, హవానాలో నుండి బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం గుణాలన్ 1991 నుండి చెన్నైలో ఆయన లాయర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు. సి.కె.చంద్రప్పన్, జోగేంద్ర సింగ్ దయాళ్, సురవరం సుధాకర్ రెడ్డి, అజీజ్ పాషా తదితరులకు ఆయన సహచరుడు. గుణాలన్ అకాల మరణం పట్ల సిపిఐ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి, బివి విజయలక్ష్మి, అజీజ్ పాషా తదితరులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
గుణాలన్ కన్నుమూత
RELATED ARTICLES