అహ్మదాబాద్: సొంత మైదానంలో జరిగిన పోరులో ముంబయిని గుజరాత్ టైటాన్స్ చిత్తుగా ఓడించింది. 55 పరుగుల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులే చేసింది. నేహల్ వదేరా(40), కామెరూన్ గ్రీన్(33), మినహా మిగతావారు విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 3, రషీద్ ఖాన్ 2, మోహిత్ శర్మ 2, పాండ్య ఒక వికెట్ పడగొట్టారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్(56), మిల్లర్(46), అభినవ్ మనోహర్(42) చెలరేగారు.
గుజరాత్ ఘన విజయం
RELATED ARTICLES