గుంటూరు ప్రమాదాల్లో 10మంది మృతి

ప్రజాపక్షం/వట్టిచెరుకూరు/ వెల్దుర్తి: గుంటూరు జిల్లాలో ఘటనలో జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. టవేరా వాహనం వాగులోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు చెందగా.. మరో నలుగురికి గా యాలయ్యాయి. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నా రు. గ్రామానికి చెందిన బంధువులంతా గుంటూరు రూరల్‌ మండం ఏటుకూరులో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులనుసమాధుల శ్రీను(50), పొగడ్త వీ రలక్ష్మి (48) సమాధుల వన్నూరు (55) సమాధుల సీతమ్మ(65) పొగడ్త రమ ణ(48) గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. మరో రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్దుర్తి మండలం లచ్చమల్లపాడు వద్ద క్వారీలో లారీ పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు రైతులు మృతి చెందారు. మృతులు బోధలవీడు రైతులుగా గుర్తించారు. మిర్చిలోడుతో మార్కెట్‌ యార్డుకు వెళ్తుండగా ఘటన జరిగింది. మృతులు నాయుడు సాంబయ్య, శ్రీహరి, రమేష్‌, శ్రీనివాసరావుగా గుర్తించారు.

DO YOU LIKE THIS ARTICLE?