HomeNewsTelanganaగిరిజన సంక్షేమంపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదు

గిరిజన సంక్షేమంపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదు

సిపిఐ ఎంపి బినొయ్‌ విశ్వం విమర్శ
న్యూఢిల్లీ:
గిరిజన సంక్షేమంపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సిపిఐ పార్లమెంటు సభ్యుడు బినొయ్‌ విశ్వం విమర్శించారు. గిరిజను ల అభ్యున్నతికి పాటుపడుతున్నట్టు మోడీ ప్రభుత్వం ప్రకటించుకోవడం విడ్డూరమని కాన్‌స్టిట్యూషన్‌ (షెడ్యూల్డ్‌ ఆర్డర్‌ (అమెండ్‌మెంట్‌) బిల్‌ 2024, కాన్‌స్టిట్యూషన్‌ (షెడ్యూల్డ్‌ కాస్ట్‌, షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌) ఆర్డర్‌ (అమెండ్‌మెంట్‌) బిల్‌ 2024 బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన ధ్వజమెత్తారు. మనువాదాన్ని సమర్థించే ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నదని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రణలో ఉన్న బిజెపి సర్కారు గిరిజన, వెనుకబడిన వర్గాల వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని బినోయ్‌ విశ్వం మండిపడ్డారు. కొత్త పార్లమెంటు భవ నం ప్రారంభోత్సవానికి గిరిజనురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎందుకు ఆహ్వానించలేదో సభకు తెలపాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. గిరిజనురాలు కాబట్టే అయోధ్యలో జరిగిన ప్రాణప్రతిష్టకు కూడా రాష్ట్రపతిని పిలవలేదా? లేక మహిళ, విధవరాలనే కారణంగా ఆమెను పక్కకు పెట్టారా? అని నిలదీశారు. దేశ తొలి పౌరురాలికే ఇలాంటి పరిస్థితి ఉంటే, మైనారిటీల పట్ల బిజెపి ఆర్‌ఎస్‌ఎస్‌ ఏ విధంగా వ్యవహరిస్తుందో ఊహించుకోవచ్చని అన్నారు. మనువాద సిద్ధాంతాలు ఎన్నడూ మహిళలు, గిరిజనులు, ఎస్‌సిలను మిగతా వారితో సమానంగా చూడవని బినోయ్‌ విశ్వం విమర్శించారు. ‘చతుర్వర్ణ’ చట్రంలోనే బిజెపి ప్రభుత్వం పని చేస్తున్నదని, అగ్రవర్ణాల పాలకు ప్రాతినిథ్యం ఇస్తున్నదని ఆయన ఆరోపించా రు. ఎస్‌సిలు, ఎస్‌టిలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి దుర్భర జీవితాలను పట్టించుకోవడం లేదని అన్నారు. గిరిజనుల ‘జల్‌ జంగల్‌ జమీన్‌’ కార్పొరేట్‌ దోపిడీకి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌సి, ఎస్‌టి, వెనుకబడిన తరగతుల వారికి భద్రత కల్పించి, వారి అభ్యున్నతికి ఉద్దేశించిన మండల్‌ కమిషన్‌ను వ్యతిరేకించిన శక్తుల్లో బిజెపిది అగ్రస్థానమని అన్నారు. ఇన్ని రకాలైన దారుణాలు చేస్తున్న బిజెపి తనను తాను గిరిజనులకు మేలు చేసే పార్టీగా ప్రకటించుకుంటున్నదని అన్నారు. నిజానికి బిజెపిలో పూర్తిగా గిరిజన వ్యతిరేక భావనలు నిండివున్నాయని బినోయ్‌ విశ్వం వ్యాఖ్యానించారు. కేవలం ఓట్ల కోసమే గిరిజనులు, ఎస్‌సిలు, బిసిల గురించి బిజెపి మాట్లాడుతున్నదని విమర్శించారు. ఈ వర్గాలను ఓటు బ్యాంకు మాదిరిగానే చూస్తున్నదని అన్నారు.
ఎస్‌సి, ఎస్‌టి జాబితాలో మార్పులకు ఓకే…
ఎపి, ఒడిశాలో ఎస్‌సి, ఎస్‌టి జాబితా మార్పులకు సంబంధించిన రెండు బిల్లులకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. కాన్‌స్టిట్యూషన్‌ (షెడ్యూల్డ్‌ ఆర్డర్‌ (అమెండ్‌మెంట్‌) బిల్‌ 2024, కాన్‌స్టిట్యూషన్‌ (షెడ్యూల్డ్‌ కాస్ట్‌ మరియు షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌) ఆర్డర్‌ (అమెండ్‌మెంట్‌) బిల్‌ 2024లను రాజ్యసభ మంగళవారం ఆమోదించింది. ఈ రెడు బిల్లులు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్‌ ముండా రాజ్యసభలో ప్రవేశపెట్టారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments