ప్రజాపక్షం/హైదరాబాద్ హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనం అం శంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై బుధవారం తీర్పు వెలువడే అవ కాశాలున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన గణేశ్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని మంత్రి కార్యాల యంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మంగళవారం కలిసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుప్రీం తీర్పు కోసం ఎదురు చూస్తున్నామన్నారు. సానుకూలమైన తీర్పు వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు, శోభాయాత్రను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మంత్రిని కలిసిన వారిలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి జనరల్ సెక్రెటరీ భగవంత రావు, ఉపాధ్యక్షుడు కరోడి మాల్, విశ్వహిందు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు, ఉత్సవ సమితి కమిటీ సభ్యుడు రామరాజు తది తరులు ఉన్నారు. హుస్సేన్‌సాకర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయరాదని, వాటిని ప్రత్యేకంగా నిర్మించిన బేబీ పాండ్స్‌లోనే నిమజ్జనం జరపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసింది. తమ నిర్ణయం పై అభ్యంతరాలుఉంటే సుప్రీం కోర్టుకు వెళ్లాలని వ్యాఖ్యానించింది. వినాయకచవితికి కేవలం ఒక రోజు ముందు హైకోర్టు తీర్పు వెలువడగా, అప్పటికే వివిధ మండపాల్లో వినాయక విగ్రహాల ప్రతిష్టాపన జరిగిపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకొని, పెద్దమనసుతో వ్యవహరించి ఎప్పటి మాదిరిగానే హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. హుస్సేన్‌సాగర్‌ను కలుషితం చేసేందుకు అనుమతి ఇవ్వాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమస్య ఇది వరకే తెలిసినప్పటికీ, ఇంత వరకూ ఎందుకు స్పందించలేదని రాష్ట్ర సర్కారును నిలదీసింది. కాగా, రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చడంతో, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బుధవారం ఉదయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
మట్టి వినాయకులను ప్రతిష్టిస్తాం..
ఇకపై మట్టి వినాయకులనే ప్రతిష్టాస్తామని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రకటించింది. అదే విధంగా, మండలాప వద్దే నిమజ్జరం జరిగేలా చూస్తామని తెలిపింది.
గణేష్ నిమజ్జనంపై సుప్రీంకు సర్కార్
RELATED ARTICLES