పేరెత్తవద్దంటే… ఎయిర్ పోర్టును మూసివేయండి.. హైటెక్ సిటీని కూల్చివేయండి
కెసిఆర్‌కు ఆ ధైర్యం ఉందా ?
ప్రజాఫ్రంట్ ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ సవాల్
ప్రజాపక్షం / హైదరాబాద్ : గడీల పాలనను అం తం చేసింది టిడిపియేనని, తెలుగుదేశం జెండా ఎ గరాలి తెలంగాణ నిండా సినీ నటులు, టిడి పి హిందూపురం ఎంఎల్ఎ బాలకృష్ణ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాఫ్రంట్ అధికారంలోకి తీ సుకురావడం ద్వారా కెసిఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పలకాలన్నారు. ప్రజాఫ్రంట్ తరపు న శేరిలింగంపల్లి నియోజవర్గం నుంచి పోటీ చేస్తు న్న భవ్య ఆనంద్ ప్రసాద్ విజయం కోసం ఆదివా రం బాలకృష్ణ రోడ్ షో నిర్వహించి పలు ప్రాంతా ల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో టిడిపి అధ్యక్షులు, ఎపి సిఎం చంద్రబాబునాయుడు పేరు వినిపించకుండా చేయాలంటే, శం షాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేయాలని, హైటెక్ సిటీని కూల్చి వేయాల ని, ఫ్లుఓవర్లను తొలగించాలని చెప్పారు. ఈ పను లు చేసె ధైర్యం కెసిఆర్‌కు ఉందా అని బాలకృష్ణ సవాల్ చేశారు. పార్టీ మారిన నేతలంతా నమ్మక ద్రోహులేనని, వారందరినీ ఓడించి, మరొకరు ఇ లా చేయకుండా బుద్ధి చెప్పాలని బాలకృష్ణ అన్నా రు. టిడిపి గురించి కెసిఆర్ కాకమ్మ కబుర్లు చెబుతున్నారని, టిడిపి లేకుంటే కెసిఆర్ ఎక్కడి నుంచి వచ్చేవారని ఆయన అన్నారు. ‘సమ కో సం పోరాడింది టిడిపి సమాజంలో అసమానతలను రూపు మాపేందుకు కృషి చేసింది. తెలుగుజాతి గౌరవాన్ని, ఉనికిని కాపాడింది. తెలుగు వా రిలో రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చింది టిడిపి జెండాయే’ అని బాలకృష్ణ అన్నారు. రాష్ట్రంలో ఉ ద్యోగాల కల్పన పెద్దఎత్తున జరగాలంటే ప్రజా కూ టమిని గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.