HomeNewsBreaking Newsఖమ్మం జనసంద్రం

ఖమ్మం జనసంద్రం

బిఆర్‌ఎస్‌ తొలి సభ విజయవంతం
పోరాటానికి అడుగులు… కేంద్ర ప్రభుత్వం పేదల వ్యతిరేకి, రైతుల ద్రోహి
ప్రజాపక్షం/ ఖమ్మం
ఖమ్మంలో బుధవారం భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) పార్టీ ఆవిర్భావ సభ విజయవంతమైంది. బిఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ భారీ బహిరంగసభలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌తో పాటు సిపిఐ, సిపిఐ(ఎం), ఎస్‌పి, ఆప్‌ తదితర రాజకీయ పార్టీల రాష్ట్ర నేతలు, తెలంగాణ మంత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, ఆర్థిక, రాజకీయ విధానాలను సభలో ప్రసంగించిన వక్తలు తూర్పారపట్టారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులతో దేశానికి ముప్పు ఏర్పడిందని, లౌకికతత్వం ప్రమాదంలో పడిందని వక్తలు పేర్కొన్నారు. గవర్నర్ల వ్యవస్థను బిజెపి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్న తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి వ్యతిరేక పోరాటంలో భాగంగా ఖమ్మం వేదికగా ప్రతిపక్ష పార్టీలు కలవడం హర్షనీయమని, ఇదే స్ఫూర్తితో మున్ముందు వెళ్లాలని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వం దేశంలో రాజకీయ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నదని పినరయ్‌ విజయన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపబ్లిక్‌ దినోత్సవ పరిరక్షణకు కూడా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి దేశంలో ఏర్పడిందని డి.రాజా ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు అడ్డుపడడమే గవర్నర్ల పనిగా మారిందని కేజ్రీవాల్‌, బిజెపి అరాచకాలు బట్టబయలయ్యాయని భగవంత్‌ మాన్‌ అన్నారు. విపక్షాలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా బిజెపి పనిచేస్తుందని అఖిలేష్‌ విరుచుకుపడ్డారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments