డిసెంబర్ 6 నుంచి ఆంధ్రతో జరిగే రంజీ మ్యాచే చివరిది
న్యూఢ్లిల్లీ: భారత వెటరన్ బ్యాట్స్‌మన్ గౌతమ్ గంభీర్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు మంగళవారం ప్రకటించాడు. ఈ నెల 6 నుంచి ఆంధ్రప్రదేశ్‌తో జరిగే రంజీ ట్రోఫీ మ్యాచే తనకు చివరిదని గంభీర్ అన్నాడు. రిటైర్మెంట్‌కు సంబంధించిన వీడియోను గంభీర్ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. భారత జట్టుకు సుదీర్ఘ కాలం ఓపెనర్‌గా సేవలందించిన గంభీర్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటనతో అందరికి షాకిచ్చాడు. భారత్‌కు ఎన్నో గొప్ప విజయాలు అందించిన గంభీర్ గత కొంత కాలంగా భారత జట్టులో చోటు సాధించలేక పోయాడు. దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నప్పటికీ పెద్దగా రాణించలేకపోయాడు. టెస్టుల్లో 2004 నుంచి 2016 వరకు భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన గంభీర్ ఈ ఫార్మాట్లో అద్భుతంగా రాణించాడు. తర్వాత ఫామ్‌లేమితో సతమతమవుతూ జట్టులో స్థానం కోల్పోయాడు. మొత్తం 58 టెస్టులు ఆడిన గంభీర్ 41.95 సగటుతో 4154 పరుగులు చేశాడు. అందులో 9 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక, వన్డేల్లో 2003 నుంచి 2013 వరకు 147 మ్యాచులాడి 39.68 సగటుతో 5238 పరుగులు చేశాడు. మరోవైపు 37 టి20లు ఆడాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి 87 ఇన్నింగ్స్‌లలో 4412 పరుగులు చేశాడు. టెస్టుల్లో భారత్ తరఫున వీరిద్దరి భాగసామ్యమే అత్యుత్తమం. గంభీర్ 2009లో ఐసిసి టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కైవసం చేసుకున్నాడు. ధోనీ సారథ్యంలో భారత్ (టి20, వన్డే) రెండు ప్రపంచకప్‌లు గెలుచుకుంది. అయితే ఈ రెండు ప్రపంచకప్ ఫైనల్స్‌లో టీమిండియా విజయంలో హీరో పాత్ర పోషించింది గౌతమ్ గంభీరే. టైటిల్ పోరులో అత్యధిక పరుగులు చేసి భారత్‌కు రెండు ప్రపంచకప్ టైటిళ్లు అందించిన ఘనత గంభీర్‌కే సొంతం. 2011లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ వెనువెంటనే పెవిలియన్ చేరగా.. తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గంభీర్ 97 పరుగులు చేసి టీమిండియాను ఆదుకున్నాడు. 2007లో జరిగిన టి20 ప్రపంచకప్ ఫైనల్లో కూడా గంభీర్ కీలకమైన ఇన్నింగ్స్‌తో 75 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 5 పరుగులతో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది.
క్రికెట్ కెరీర్‌కు గౌతమ్ గంభీర్ వీడ్కోలు!
RELATED ARTICLES