విదేశీ ఫార్మా సంస్థలకు ఏ మాత్రం తీసిపోం
‘కోవాగ్జిన్’ను రాజకీయం చేయకండి
ఇప్పటివరకు 16 టీకాల తయారీ, 123 దేశాలకు సేవలు
ఏటా 70 కోట్ల డోసుల కోవాగ్జిన్ టీకా ఉత్పత్తి సామర్ధ్యం : కృష్ణ ఎల్ల
న్యూఢిల్లీ: ఐసిఎంఆర్ సారథ్యంలో హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ తయారు చేసిన కరోనా నియంత్రణ టీకా కోవాగ్జిన్‌పై అనుకూల ప్రతికూల వాదాలపై ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్ల ప్రతిస్పందించారు. ఈ విమర్శలు భారత్ ఫార్మా కంపెనీలను ఎదురుదెబ్బ తీస్తాయన్నా రు. కోవాగ్జిన్‌కు ఎందుకు ఆదరాబాదరాగా అనుమతులిచ్చారంటూ ప్రధాన ప్రతిపక్షంలోని సీనియర్ నేతలు డ్రగ్స్ రెగ్యులేటర్‌పై విమర్శలు గుప్పించడాన్ని హైదరాబాద్‌లో సోమవారంనాడు జరిగిన మీడియా సమావేశంలో ఆయన ) తప్పు పట్టారు. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సిడిఎస్‌సిఓ) నిపుణుల కమిటీకి ఇచ్చిన సమాచారంలో పారదర్శకత లేదన్న విమర్శల్లో నిజం లేదని కృష్ణ ఎల్ల అన్నారు. మాకు (భారత్ బయోటెక్) బ్రహ్మాండమైన అనుభవం ఉంది, ఇప్పటివరకు 16 టీకాలు తయారు చేశాం, 12 దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాం, 123 దేశాలకు సేవలు అందిస్తున్నాం, నాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు, మా పని మేము చేసుకుపోవడమే మాకు తెలుసు అన్నారు ఆయన. బయోటెక్‌కు ఉన్న నాలుగు ఉత్పత్తి కేంద్రాల ద్వారా ఏటా 70 కోట్ల డోసుల కోవాగ్జిన్ టీకా తయారు చేయగల సామర్ధ్యం ఉందని ఆయన చెప్పారు. ఈ కొత్త సంవత్సరం (2021)లో 760 కోట్ల డోసుల ఉత్పత్తి సామర్ధ్యానికి చేరుకుంటామని, ప్రస్తుతం ఇప్పుడు రెండు కోట్ల డోసులు తమ వద్ద ఉన్నాయని కృష్ణ ఎల్ల చెప్పారు. కోవాగ్జిన్ టీకా ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్నాయి, 24 వేలమంది స్వచ్ఛంద సేవకులు ఈ ట్రయల్స్‌లో పాల్గొంటున్నారు అందువల్ల, నా ఉద్దేశంలో, ఇంత విస్తారమైన పరిశోధనా అనుభం సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెడికల్ జర్నల్స్‌లో సమీక్షా వ్యాసాల ప్రచురణతోపాటు ఇంత విస్తారమైన సానుకూల ప్రచారం మాకే ఉందని నేను భావిస్తున్నాను, ఈ దశలో చేసే విమర్శలు భారత్ కంపెనీలపై ప్రతికూలమైన ఎదురుదెబ్బ తీస్తాయి అని కృష్ణ ఎల్ల తప్పుపట్టారు. మా సంస్థ కున్న టీకా సంబంధింత సమాచారంలో పారదర్శకత లేదని చాలామంది అంటున్నారు, నా ఉద్దేశం ఏమిటంటే, అలాంటివారంతా కాస్తంత ఓర్పుతో, సహనంతో అంతర్జాలంలో మా సంస్థ గురించి వస్తున్న సమీక్షా వ్యాసాల్ని చదమని కోరుతున్నాను, అప్పుడు తప్పకుండా ఆరోపణలు చేసేవారికి జవాబుగా తగినంత సమాచారం దొరుకుతుంది అన్నారు ఆయన. భారత్ కంపెనీలేమీ తక్కువ కాదు, కరోనా టీకాను ఉత్పత్తి చేసిన ఫైజర్ కంపెనీ కంటే మా కంపెనీ తక్కువదేమీ కాదు, ఇప్పుడు ఆ టీకాను రాజకీయం చేస్తున్నారు, మా కుటుంబీకులెవ్వరికీ ఏ రాజకీయపార్టీతోనూ సంబంధం లేదు, చాలామంది గాసిప్పింగ్ (పనిలేని ముచ్చట్లు, వ్యర్థ ప్రసంగాలు) చేస్తున్నారు, ఇలాంటివన్నీ భారత్ కంపెనీలను అంతర్జాతీయంగా ఎదురుదెబ్బ తీస్తాయి, అందువల్ల ఇదంతా మనకు మంచిది కాదు, అలాంటివాటికి మనం సరిపోం, అవన్నీ మనకు వద్దు, ఇలాంటివాటివల్ల మెర్క్ ఎబోలా టీకా హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌ను ఎప్పటికీ పూర్తి చెయ్యలేకపోయింది, కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం లైబీరియా, గినియా దేశాలకకు మాత్రం అత్యవసరాలకోసం అనుమని మంజూరుచేసింది అని కృష్ణ ఎల్ల గుర్తు చేశారు. “కోవాగ్జిన్ 10 శాతం కంటే తక్కువగానే ప్రతికూల ఫలితాల్ని చూపించింది, అదేసమయంలో మిగిలిన టీకాలు 60-70 శాతం మేరకు ప్రతికూల ఫలితాల్ని చూపించాయి, ఆస్ట్రాజెనికా ఈ విధమైన రియాక్షన్స్‌ను తగ్గించడాననికి వాలంటీర్లకు నాలుగు గ్రాములు పారాసెట్‌మాల్ ఇచ్చింది, మేం మాత్రం ఏ వాలంటీరుకూ కూడా ఇలా పారాసెట్‌మాల్‌ను ఇవ్వలేదు, మా కోవాగ్జిన్ టీకా 200 శాతం సురక్షితమైనదని నేను భరోసా ఇవ్వగలను” అన్ని ఉద్ఘాటించి చెప్పారు కృష్ణ ఎల్ల.
కోవాగ్జిన్ టీకా 200% సురక్షితం
RELATED ARTICLES