కోట్లాది రూపాయలు కొట్టేశారు..!

ఇఎస్‌ఐ కుంభకోణంలో ఉన్నతాధికారి నుంచి చిరుద్యోగి వరకు పోటీపడి దోచుకున్నారు
ఒక్క దేవికారాణి ఆస్తులే రూ.50 కోట్లకుపైనే

ప్రజాపక్షం/హైదరాబాద్‌: ఇఎస్‌ఐ మెడికల్‌ కుంభకోణం కేసులో ఏ నిందితుడ్ని కదిలించినా రూ.కోట్లకు కోట్లే దోచేసుకు న్న వాస్తవాలు విచారణలో వెలు గు చూస్తున్నాయి. నిందితులు ఆరేళ్ల నుంచి దోచుకున్న తీరును చూసి ఎసిబి అధికారులే ముక్కు న వేలేసుకుంటున్నారు. ఈ కేసు లో ఇప్పటికే ఎసిబి అధికారులు 16 మంది నిందితులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఫార్మా కంపెనీ ఎండిలు, ప్రైవేటు ఆసుపత్రుల ఎండిలు, ఇఎస్‌ఐ డైరెక్టర్‌తో పాటు చిరుద్యోగులు సైతం ఉన్నారు. వీరిలో ఏ నిందితుడి ఆస్తులు చూసినా రూ.కోట్లలో బయటపడుతున్నాయి. ఇఎస్‌ఐ డైరెక్టర్‌ డాక్టర్‌ సిహెచ్‌.దేవికరాణి ఆస్తుల చిట్టా చూసి ఎసిబి అధికారుకే దిమ్మతిరిగింది. ఆమె ఈ ఆరేళ్లలో సుమారు రూ.50 కోట్లకుపైగా కూడబెట్టినట్లు తనిఖీల్లో బయటపడింది. దేవికరాణికి హైదరాబాద్‌, రంగారెడ్డి, భువనగిరి తదితర జిల్లాలలో ఖరీదైన ఫ్లాట్లు, ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూములు ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. ఆమె ఇంట్లో తనిఖీ చేసిన సమయంలో లభించిన ఆభరణాలలో పొదిగి ఉన్న వజ్రాల విలువ కేవలం రూ.2 కోట్ల ఖరీదైనవని ఎసిబి అధికారులు గుర్తించారు. ఇక ఆమె ఆభరణాల విలువ కూడా రూ.కోట్లలోనే ఉంది. ఈ కేసులో ఉన్నతాధికారుల నుంచి చిరుద్యోగి వరకు పోటీ పడి మరీ దోచుకున్నారు.ఇక ఇదే కేసులో అరెస్టు అయిన బాలనగర్‌ వెంకటేశ్వర హెల్త్‌ సెంటర్‌ ఎండి డాక్టర్‌ చెరుకు అరవింద్‌రెడ్డి కూడా రూ.28 కోట్లకుపైగా ఇఎస్‌ఐ ధనాన్ని కొల్లగొట్టాడని తేలింది. వారం రోజుల క్రితం అరెస్టు అయి ప్రస్తుతం జైలులో ఉన్న లైఫ్‌కేర్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాసూటికల్‌ కంపెనీ ఎండి బి.మధుసూదన్‌రెడ్డి మందుల కొనుగోళ్ల సందర్భంగా అక్రమంగా రూ.48 కోట్లకుపైగా దోచుకున్నట్లు ఎసిబి విచారణ లో తేలింది. అలాగే ఓమ్నిమోడి ఆసుపత్రి ఎండి కె.శ్రీహరిబాబు సైతం తాను తక్కువ కాదన్నట్లు రూ.9 కోట్లకుపైగా ఇఎస్‌ఐకి శఠగోపం పెట్టాడని తెలుస్తుంది. తేజా ఫార్మా ఎండి రాజేశ్వర్‌రెడ్డి మందుల సరఫరాలో అక్రమాలకు పాల్పడి సుమారు రూ.32 కోట్లకుపైగా దోచుకున్నట్లు తెలుస్తుంది. ప్రైవేటు వ్యక్తులు ఇఎస్‌ఐ అధికారుల అండదండలతో కో ట్ల రూపాయలు దోచుకున్నారు. వీరికి సమానంగానే తామేమీ తక్కువ తిన్నామా అన్నట్లు పోటాపోటీగా ఇఎస్‌ఐ అధికారులు, ఉద్యోగులు దోచుకున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?