HomeNewsBreaking Newsకొత్త సచివాలయం మాదిరేవెలిగిపోతున్న పల్లెలు

కొత్త సచివాలయం మాదిరేవెలిగిపోతున్న పల్లెలు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు
డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సెక్రటేరియట్‌ ప్రారంభం
ప్రజాపక్షం/హైదరాబాద్‌
సచివాలయం ఎంత అద్భుతంగా ఉన్నదో తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు కూడా అంతే అద్భుతంగా విరజిల్లుతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణమంటే మొత్తం కూలగొట్టి మళ్లీ కడుతరా? అంటూ కొంద రు కురుచ వ్యక్తులు, దుర్మార్గులు, మరుగుజ్జు వ్యక్తులు చిల్లర వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలను పట్టించుకోకుండా పని చేశామన్నారు. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాలని, సచివాలయానికి వచ్చే ముఖ్యమంత్రి, మం త్రులు, అధికారులందరికీ అనునిత్యం స్ఫురణకు రావాలన్నారు. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆదివారం ప్రారంభించారు. నూతన సచివాలయానికి వచ్చిన కెసిఆర్‌కు అధికారులు ఘనస్వాగతం పలికారు. పోలీసులు తమ గౌరవవందనంతో సిఎంను ఆహ్వానించారు. అనంతరం ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌లో నిర్ణీత ముహూర్తానికి తన కుర్చీలో కూర్చున్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ దస్త్రంపైన కెసిఆర్‌ తొలి సంతకం చేశారు. మొత్తం ఆరు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కెసిఆర్‌ మాట్లాడారు. తెలంగాణకు గుండెకాయలాంటి సచివాలయాన్ని ప్రారంభించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దేశంలో ఎక్కడ కూడా తెలంగాణలో ఉన్న పల్లెలు లేవని, ఇందులో అనుమానమే లేదని స్పష్టం చేశారు. ‘పునర్నిర్మాణమంటే నాడు సమైక్య పాలనలో చిక్కిశిల్యమైపోయి, శిథిలమైపోయి, రంద్రాలతో మొత్తం వచ్చిన నీటిని కూడా కోల్పోయినటువంటి, అద్భుతమైన కాకతీయ రాజుల స్ఫూర్తితో నిర్మణమైన ఆ చెరువులన్నింటినీ పునరుద్ధరించి, ఎండాకాలంలో కూడా మత్తెడులు దూకే చెరువులే పునర్మిర్మాణానికి భాష్యమని వివరించారు. అంబేద్కర్‌ సందేశం మనసులో పెట్టుకొని పనిచేయాలని, అంకితభావం తో పనిచేయాలనే ఉద్ధేశంతోనే సచివాలయానికి భారతదేశం గర్వించేలా ఆయన పేరు పెట్టుకున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ఆయన వివరించారు. భవిష్యత్తుకు కూడా బాటలు వేసుకుంటామని కెసిఆర్‌ హామీనిచ్చారు.
ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో అద్భుతమైన తెలంగాణ
ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ఒక అద్భుతమైన తెలంగాణగా రూపొందుకున్నామని కెసిఆర్‌ అన్నారు. సెక్రటేరియట్‌ వెలుగులకు దీటైన తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఎంఎల్‌ఎల నుంచి సర్పంచ్‌ల వరకు, చీఫ్‌ సెక్రటరీ నుంచి అటెండర్ల వరకూ సిఎం శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ అందించిన సందేశంతో, గాంధీజీ మార్గంలో శాంతియుత పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాల ముఖాల్లో చిరునవ్వు రావాలనే బాబాసాహెబ్‌ స్ఫూర్తిని అందుకున్నామని, అందుకే అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆకాశమంత ఎత్తయిన ఆయన విగ్రహాన్ని తెలంగాణయే కాదని, భారత జాతి కీర్తిని పెంచుకునేలా ప్రతిష్టించుకున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మలుపులలో తమ ప్రాణాలను అర్పించినటువంటి అమరులందరికి సిఎం అంజలి ఘటించి, నివాళులు సమర్పించారు. తెలంగాణ అవతరించిన కొత్తలో, అంతకు ముందు చాలా వాదవివాదాలు, వాదోపవాదాలు, చర్చలు మనం చూశామని, తెలంగాణ అవతరించిన తర్వాత కూడా పునర్నిర్మాణంలో మనం అంకితభావంతో పనిచేస్తున్న సందర్భంలో కొందరు అర్చకులు, తెలంగాణ భావాన్ని, అర్ధాన్ని, పునర్నిర్మాణకాంక్షను జీర్ణించుకోలేని వారు కారుకూతలు కూశారన్నారు. చిల్లర వ్యాఖ్యలను పట్టించుకోకుండా పనిచేశామని, ఈరోజు ఆకాశమంత ఎత్తుకు ఎదిగినందుకు తాను గర్వంగా భావిస్తున్నానన్నారు. తెలంగాణ ఇంజనీర్లు చేసిన అద్భుతమైన ఇంజనీరింగ్‌ మార్వెల్‌ ఇన్‌ ద వరల్డ్‌, మల్టీ పర్పస్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ శిఖరాయమానంగా ప్రపంచానికి తలమానీకంగా వెలిగిందని, ఇదీ పునర్మిర్మాణమంటే అని వివరించారు. గోదావరి, కృష్ణ నదుల్లోని వాగుల్లో నిర్మించిన చెక్‌ డ్యామ్‌లు, మంజీరా, మానేరు. హల్ది, గూడవెల్లి ఉప నదుల మీద నిర్మించిన చెక్‌ డ్యామ్‌లు ఏప్రిల్‌, మే నెలల్లో కూడా మత్తెడులు దుంకడమే కళ్లుండి చూడలేని కబోధులకు పునర్మిర్మాణానికి భాష్యం అని వివరించారు.
అనేక రంగాల్లో ముందుకెళ్తున్నాం
అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తుందని సిఎం కెసిఆర్‌ అన్నారు. తెలంగాణ ఒక సమ్మిళిత అభివృద్ధితో రైతాంగాన్ని, సంక్షేమంతో పాటు పారిశ్రామిక విధానంలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామన్నారు. తమ ఇండస్ట్రియల్‌ విధానంలో, ఐటీ విధానంలో బెంగుళూరును కూడా దాటేసి ఎదిగిపోతున్నదన్నారు. మరుగుజ్జుల్లారా జాగ్రత్త ఇప్పటికైనా ‘మీ కుళ్లులు బంజేసుకోమని’ సూచించారు. అద్బుత ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ.. మిగులు రాష్ట్రంగా కొనసాగుతూ, పెరుగుతూ దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా రూ.3,00,017 లతో పర్‌ కాపిటా ఇన్‌కమ్‌లో నంబర్‌ వన్‌లో ఉన్న తెలంగాణయే అని అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments