అబూధాబి: భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్ విదేశాంగ మంత్రి షేఖ్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అధ్య క్షతన జరిగిన యుఎఇ-భారత్ సంయుక్త కమిషన్ సమావేశంలో కొత్త రంగాల్లో కూడా ఇరుదేశాలు భాగస్వామ్యం పెంపొందించుకోవాలని మం గళవారం నిర్ణయించారు. ప్రస్తుతం సుష్మ రెండు రోజుల పర్యటనపై యుఎఇలో ఉన్నారు. ఆర్థిక, సాంకేతిక సహకారానికి సంబంధించిన యు ఎఇ-భారత్ సంయుక్త కమిషన్ 12వ సమావేశం ఇది. ఈ రెండు దేశాల మ ధ్య 500 కోట్ల డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతోంది. భారత్ ఇంధ నా న్ని దిగుమతి చేసుకునే ఆరవ పెద్ద దేశం యుఎఇ. ఈ సందర్భంగా సుష్మ అబూధాబిలోని భారతీయులతో కూడా మాటామంతీ జరిపారు.
కొత్త రంగాల్లో భారత్, యుఎఇ భాగస్వామ్యం
RELATED ARTICLES