కొత్త ఆహార భద్రత చట్టం

అసెంబ్లీలో మంత్రి కెటిఆర్‌ ప్రకటన

ప్రజాపక్షం / హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త ఆహార భద్రత చట్టం తీసుకువస్తామని మంత్రి కె.తారకరామారావు తెలిపా రు. అసెంబ్లీలో సోమవారం ఎంఐఎం సభ్యు లు ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌, మహ్మద్‌ మోజంఖాన్‌ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ ఆహార భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికి ఇప్పటికీ కల్తీ అవుతున్నాయన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్న ఫుడ్‌ సేఫ్టీ ఆక్ట్‌ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దీనిలో జరిమానాలు, శిక్షలు తక్కువగా ఉన్నాయన్నారు. అందుకే జరిమానాలు పెంచుతూ, ఆహార పదార్థాల కల్తీ జరగకుండా ఉండేలా ఈ కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నామని  అన్నారు. జరిమానాల విషయమై ఇప్పటికే జిహెచ్‌ఎంసి కమిషనర్‌ను ఆదేశించామన్నారు. ప్రధానంగా హైదరాబాద్‌లో ఆహార పదార్థాల కల్తీ బాగా జరుగుతోందని, తగినంత మంది సిబ్బంది, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల కొరత కారణంగా పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోతున్నారని సభ్యులు అడగా, త్వరలోనే నగరంలో ఉన్న 26 ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల ఖాళీలు భర్తీ అవుతాయని, వీరి నియామకపు ప్రక్రియ జరుగుతోందన్నారు. అయినప్పటికి ఇప్పటికే ఉన్న వారు సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?