కేసులు కోటి దాటేశాయ్‌!

ప్రపంచ వ్యాప్తంగా 1,01,68,063 బాధితులు 5 లక్షల మందిని బలితీసుకున్న మహమ్మారి

పారిస్‌ : ప్రపంచాన్ని భీతిల్లిపోయేలా చేస్తున్న కరోనా ఇప్పటి వరకు 5 లక్షల మందిని బలితీసుకుంది. కేసులు కోటి దాటాయి. అందులో సగం కేసులు యూరప్‌, యునైటెడ్‌ స్టేట్స్‌ నుంచి నమోదైనవే. ఆదివారం రాత్రి 10 గంటల నాటికి ప్రపంచవ్యాప్తంగా 93,581 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 2,154 మరణాలు సంభవించాయి. ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు 1,01,68,063 నమోదయ్యాయి. 5,02,778 మంది మరణించారు. 55,07,533 మంది బాధితులు చికిత్స నుం చి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 41,58,385 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దాదాపు 58వేల మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అత్యంత వేగంగా విస్తరిస్తున్న కరోనా ప్రపంచవ్యాప్తంగా సగటున రోజుకు 4,599 మంది మరణిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ సంఖ్య 6,375గా ఉంది. ప్రస్తుతం మరణాల రేటు తగ్గినప్పటికీ పాజిటీవ్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అమెరికా, బ్రెజిల్‌, రష్యా భారత్‌, యకెలో విపరీతంగా కేసులు నమోదు అవుతున్నాయి. అమెరికాలో మొత్తం 1,28,243 మంది మరణించగా, 26,17,810 మంది కరోనా బారిన పడ్డారు. 10,81,793 మంది బాధితులు కోలుకున్నారు. బ్రెజిల్‌లో మొత్తం కేసులు 13,19,274 నమోదు కాగా, 57,149 మంది మరణించారు. 7,15,905 మంది కోలుకున్నారు. రష్యాలో మొత్తం 6,34,437 మందికి మహమ్మారి సోకగా, 9,073 మంది మరించారు. 3,99,087 మంది కోలుకున్నారు. భారత్‌లో 5,28,859 మందికి కరోనా పాజిటివ్‌ రాగా, 16,095 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,09,712ం మంది వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు. యుకెలో మొత్తం 3,11,151 కరోనా కేసులు నమోదు కాగా, 43,550 మంది మృతి చెందారు.

ఒక్క రోజే 20,000 కేసులు
భారత్‌లో విస్తృతంగా వ్యాపిస్తున్న కరోనా
కొత్తగా మరో 410 మంది మృతి
16,095కు చేరిన మృతులు
5,28,859కి పెరిగిన మహమ్మారి బాధితులు
న్యూఢిల్లీ: దేశమంతటా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తోంది. రోజు రోజుకు గణనీయంగా కొత్త కేసులు వస్తుండడం తీవ్ర భయాందోళనలకు గురిచేస్తుంది. ఆదివారం ఉదయం నాటికి గడిచిన 24 గంట ల్లో రికార్డుస్థాయిలో 20 వేలకు చేరువలో కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 5,28,859కి చేరగా, మృతుల సంఖ్య 16,095కు చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఒక్క రోజే గణనీయంగా 19,906 కొత్త కేసులు నమోదు కాగా, 410 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 వేలకుపైగా కేసులు నమోదు కావడం వరుసగా ఇది ఐదవ రోజు. నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 3,38,324 మంది మహమ్మారి బారిన ప డ్డారు. దేశంలో మొత్తం 2,03,051 యాక్టివ్‌ కేసులు ఉండగా, 3,09,712 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 58.56గా ఉన్నట్లు ఓ అధికారి చెప్పారు. మహమ్మారితో ప్రపంచంలో అత్యంత ప్రభావితమైన దేశంగా అమెరికా, బ్రెజిల్‌, రష్యాల తర్వాత భారత్‌ నాలుగో స్ధానంలో నిలిచింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా మరణాల్లో 87 శాతం ఎనిమిది రాష్ట్రాల్లోనే చోటుచేసుకున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మధ్యస్థాయి, తీవ్ర లక్షణాలతో బాధపడే రోగులకు డెక్సామెథాసోన్‌ ఔషధం వాడేందుకు ప్రభుత్వం అ నుమతించింది. ఈనెల 27 నాటికి మొత్తం 82,27,802 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్‌) పేర్కొంది. కేవలం శనివారం ఒక్క రోజే 2,31,095 శాంపిల్స్‌కు పరీక్షలు నిర్వహించింది. ఇదిలా ఉండగా, ఇక కరోనా హాట్‌స్పాట్‌గా మారిన మహారాష్ట్రలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో వరుసగా 6000కు పైగా కొవిడ్‌- కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 167 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో రోజుకు మించి రోజు గణనీయంగా కొత్త కేసులు వస్తుండడం కలవర పెడుతుంది. ఇప్పటి వరకు మొ త్తం 1,59,133 కేసులు నమోదు కాగా, 7,273 మంది మరణించారు. దేశంలో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ 24 గంటల్లో దాదాపు 3 వేల మంది కరోనా బారిన పడ్డారు. కొత్తగా 66 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 80,188 ఉండగా, మొత్తం 2,558 మంది బలయ్యారు. ఇటు, బాధితుల, అటు మరణాల్లోనూ ఢిల్లీ దేశంలో రెండవ స్థానంలో ఉంది. ఇక తమిళనాడులో కొత్తగా 68 మంది మృతి చెందా రు. ఈ రాష్ట్రంలోనూ వరుసగా రెండోరోజూ దాదాపు 4 వేలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. మొత్తం కేసుసల సంఖ్య 78,335గా ఉండగా, 1,025 మంది చనిపోయారు. గుజరాత్‌లో మొత్తం కేసులు 30,709 ఉండగా, కొత్తగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,789కు చేరింది. ఉత్తరప్రదేశ్‌లో 24 గంటల్లో 19 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 649కి చేరుకోగా, మొత్తం 21,549 కేసులు నమోదయ్యాయి. ఇక పశ్చిమ బెంగాల్‌ మొత్తం 629, మధ్యప్రదేశ్‌లో 550, రాజస్థాన్‌లో 391, తెలంగాణలో 247, ఆంధ్రప్రదేశ్‌లో 157 మంది మరణించారు. కేసుల విషయానికొస్తే.. రాజస్థాన్‌లో 16,944, పశ్చిమ బెంగాల్‌లో 16,711 తెలంగాణలో 14,419, ఆంధ్రప్రదేశ్‌లో 13,098 కేసులు నమోదయ్యాయి.
యాక్టివ్‌ కేసులకన్నా రికవరీ కేసులు లక్ష అదనం
భారత్‌లో యాక్టివ్‌ కేసులు, కరోనా నుంచి కోలుకున్న వారి మధ్య వ్యత్యాసం లక్ష దాటినట్లు ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. ఆదివారం ఉదయం నాటికి 5,28,859 కేసులు నమోదు కాగా, వాటిలో యాక్టివ్‌ కేసులకన్నా రికవరీ కేసులు అధికంగా 1,06,661 ఉన్నాయని తెలిపింది. 24 గంటల్లో మొత్తం 13,832 మది కరోనా నుంచి కోలుకోగా మొత్తం రికవరీల సంఖ్య 3,09, 712కు చేరింది. దీంతో రికవరీ రేటు 58.56గా ఉన్నట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. కాగా, భారత్‌లో కొవిడ్‌ గుర్తించేందుకు 1,036 ల్యాబ్‌లను కేటాయించారు. అందులో 749 ప్రభుత్వ ల్యాబ్‌లు కాగా, 287 ప్రైవేట్‌ ల్యాబ్‌లు ఉన్నాయి. నిత్యం 2,00,000 శాంపిల్స్‌కు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే గత 24 గంటల్లో 2,31,095 నమూనాలను పరీక్షించారు.

DO YOU LIKE THIS ARTICLE?