HomeNewsBreaking Newsకేంద్ర వైఖరికి నిరసనగా నేటి నుంచి టిఆర్‌ఎస్‌ నిరసనలు

కేంద్ర వైఖరికి నిరసనగా నేటి నుంచి టిఆర్‌ఎస్‌ నిరసనలు

మండల స్థాయి నుంచి
ఢిల్లీ వరకు కార్యాచరణ
కేంద్రానికి కనీస దయ లేదు : మంత్రి కెటిఆర్‌
ప్రజాపక్షం/హైదరాబాద్‌ ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ టిఆర్‌ఎస్‌ సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టనుంది. ఈనెల 11వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటి.రామారావు వెల్లడించారు. మండల స్థాయి నుంచి నిరసన దీక్షలను ప్రారంభించి, చివరి రోజు 11న ఢిల్లీలో నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని టిఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఈ నెల 6న నాగ్‌పూర్‌, బెంగళూరు, ముంబయి, విజయవాడ జాతీయ రహదారులపై రాస్తారోకోను, 7న హైదరాబాద్‌ మినహా 32 జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు, 8వ తేదీన అన్ని గ్రామ పంచాయతీల్లో రైతుల ఇళ్లపై నల్ల జెండాలను ఎగరవేసి నిరసన, చివరి రోజు ఏప్రిల్‌ 11న ఢిల్లీలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని, ఈ కార్యక్రమంలో మంత్రులు, టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యవర్గనేతలు, రైతు సంఘ నేతలు హాజరుకావాలని కెటిఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కెటిఆర్‌ నిరసన కార్యక్రమాల కార్యాచరణను ప్రకటించారు. ఐదంచెల ఉద్యమ కార్యాచరణలో భాగంగా నిరసన కార్యక్రమాలను చేపడుతామన్నారు. కేంద్ర నిర్లక్ష్య వైఖరితో ఎండగట్టాల్సిన బాధ్యత రైతులు, ప్రజలపైన ఉన్నదని, ఈ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రైతులను అవమానించిన కేంద్ర ప్రభుత్వానికి, ఆగం చేసిన బిజెపి రాష్ట్ర నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. నూకలు తినాలని రాష్ట్ర రైతులు, ప్రజలను బిజెపి అవమానించిందని, రైతుల పక్షాన వెళ్లిన మంత్రులను కూడా అవమానించారని, కేంద్ర ప్రభుత్వానికి రైతుల పట్ల కనీస దయ లేదని కెటిఆర్‌ విమర్శించారు.యాసంగిలో ధాన్యం పండిస్తే కేంద్రమే కొంటుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారని, రైతులను వడ్లు వేసేలా బిజెపి నేతలు రెచ్చగొట్టారని, ఇప్పుడు కేంద్రం చేతులెత్తేసిందని, మరి రైతులు పండించిన ధాన్యానికి ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments