HomeNewsBreaking Newsకేంద్రం ఇచ్చిన నిధులు వినియోగించలేదు

కేంద్రం ఇచ్చిన నిధులు వినియోగించలేదు

తెలంగాణ సిఎంపై బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా విమర్శ
ప్రజాపక్షం/వరంగల్‌
స్మార్ట్‌, హృదయ్‌, అమృత్‌ వంటి పథకాల ద్వారా కేంద్రం ఇచ్చిన నిధులను తెలంగాణ వినియోగించుకోలేదని బిజెపి జాతీ య అధ్యక్షుడు జెపి నడ్డా విమర్శించారు. ఈ మొత్తాలను ఎందుకు వాడలేదో చెప్పాలని తెలంగాణ సిఎం కెసిఆర్‌ను ప్రశ్నించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్‌ మూడవ విడత పాదయాత్ర ముగింపు బహిరంగ సభ శనివారం హనుమకొండ ఆర్ట్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల గ్రౌండ్స్‌లో జరిగింది.ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన నడ్డా మాట్లాడుతూ వరంగల్‌ స్మార్ట్‌ సిటీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.196 కోట్లు ఇచ్చిందన్నారు. వాటి పనులు కూడా ఇప్పటి వరకు పూర్తి కాకపోవడం దురదృష్టకరమన్నారు. కాళ్వేరం ప్రాజెక్టు నిరుపయోగం గా మారిందని అన్నారు. ఆ ప్రాజెక్టు కెసిఆర్‌కు ఎటిఎంలా మారిందని ఆరోపించారు. ఎంఐఎంకు భయపడి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదన్నది పూర్తిగా అబద్దమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రమే నిధులు అందిస్తున్నదని అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు,ఎంపి బండి సంజయ్‌ మాట్లాడుతూ తన పాదయాత్రను అడ్డుకోవడానికి కెసిఆర్‌ సర్కారు పన్నిన కుట్రలు ఫలించలేదని అన్నారు. రాష్ట్రంలో రౌడీల పాలన కొనసాగుతుందని దాన్ని భూస్థాపితం చేసే వరకు నిద్రపోయేది లేదన్నారు. ఈ బహిరంగ సభలో రాష్ట్ర ఇంచార్జి సునిల్‌ భన్సల్‌, రాజ్య సభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, జాతీయ నాయకులు మురళీదర్‌ రావు, డికె అరుణ, రవీందర్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments