సెయింట్ లూయిస్ (అమెరికా): భారతీయ గ్రాండ్‌మాస్టర్, భారత మహిళల నంబర్ వన్ కోనేరు హంపి ఈ ఏడాది తొలి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. అమెరికాలో జరిగిన కెయిన్స్ కప్ చెస్ టోర్నమెంట్‌ను హంపి గెలుపొందారు. తొమ్మిది రౌండ్ల టోర్నీలో హంపి ఆరు పాయింట్లు సాధించి టైటిల్‌ను సాధించారు. మరో రౌండ్ మిగిలి ఉండగానే ఆమె విజయం సాధించారు. కెయిన్స్ కప్‌ను నిర్వహించడం ఇది రెండోసారి. ఇంటర్నేషన్ చెస్ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరిగింది. సహచర క్రీడాకారిణి ద్రోణవల్లి హారికతో జరిగిన చివరి రౌండ్ డ్రాగా చేసుకున్న కోనేరు హంపి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుత వరల్డ్ చాంపియన్ జూ వెంజున్ అయిదున్నర పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచారు. ఇక రష్యాకు చెందిన అలెగ్జాండ్రా కోస్టానిక్ 5 పాయింట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. కోస్టెనిక్ నాలుగో స్థానంలో, హరిక 4.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. కెయిన్స్ కప్ విజేత హంపికి టోర్నీ నిర్వాహకులు 45 వేల డాలర్ల ప్రైజ్‌మనీ, ట్రోఫీని ఆమెకు బహూకరిస్తారు. గత ఏడాది మహిళల రాపి్డ చెస్ చాంపియన్‌షిప్‌ను గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి గెలుచుకున్న విషయం తెలిసిందే. మొత్తం 12 రౌండ్లుగా జరిగిన రాపి్డ చాంపియన్‌షిప్‌లో హంపీ 9 పాయింట్లు ఖాతాలో వేసుకొని చాంపియన్‌గా అవతరించారు. 12 రౌండ్ల తర్వాత హంపి, లీ టింగ్జి (చైనా), అతాలిక్ ఎకతెరీనా (టర్కీ) 9 పాయింట్లతో సంయుక్తంగా అగ్ర స్థానంలో నిలిచారు. మెరుగైన ’టై’ బ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను ప్రకటించగా.. హంపి, లీ టింగ్జి తొలి రెండు స్థానాల్లో నిలిచారు. అతాలిక్ మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇదివరకు హంపి మాట్లాడుతూ… ’అమ్మగా మారిన తర్వాత కూడా మేరీ కోమ్, సెరెనాలు వారి వారి క్రీడాంశాల్లో రాణిస్తున్నారు. వారిలా నేను కూడా బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత పునరాగమనం చేయాలని అనుకున్నా. నా పునరాగమనం కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేదాన్ని. అందుకోసం ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నా. పాప పుట్టిన రోజే సంవత్సరం తర్వాత తిరిగి చెస్ ఆడాలని నిర్ణయించుకున్నా. అదే విధంగా చేశా’ అని చెప్పారు.
కెయిన్స్ కప్ విజేత కోనేరు హంపి
RELATED ARTICLES