యువ నటుడు నాగ శౌర్య హీరోగా షిర్లే సెటియా హీరోయిన్ గా అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కృష్ణ వ్రింద విహారి. ఉష మూల్పూరి నిర్మాతగా ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఎంతో గ్రాండ్‌గా నిర్మితం అయిన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయి మూవీపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఏర్పరిచాయి. సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా మహతి స్వర సాగర్ సంగీతాన్ని, సాయి శ్రీరామ్ ఫోటోగ్రఫిని, తమ్మిరాజు ఎడిటింగ్‌ని అందిస్తున్నారు. ఈ మూవీ నుండి టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేసింది యూనిట్. మంచి పెప్పీ నెంబర్‌గా సాగిన ఈ సాంగ్ కి ఆకట్టుకునే ట్యూన్‌ని అందించిన సంగీత దర్శకడు మహతి స్వర స్వగర్, యువ గాయకుడు రామ్ మిరియాల తో కలిసి సాంగ్‌ని అద్భుతంగా ఆలపించారు. మొత్తంగా ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో అందరినీ అలరిస్తూ మంచి వ్యూస్‌తో కొనసాగుతోంది. కాగా ఈ రొమాంటిక్ యాక్షన్ ఫామిలీ ఎంటర్టైనర్ మూవీని సెప్టెంబర్ 23న భారీ స్థాయిలో థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నారు.
‘కృష్ణ వ్రింద విహారి’ నుండి టైటిల్ సాంగ్
RELATED ARTICLES