గాయంతో సతమతమవతున్న గబ్బర్
ముంబయి: న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ దూరం కానున్నట్టు తెలుస్తోంది. గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతడు అందుబాటులో ఉండడని సమాచారం. న్యూజిలా్‌ండ పర్యటనలో భారత్ అయిదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. దీనిలో భాగంగా సోమవారం రాత్రి టీమిండియా ఆక్లాండ్‌కు బయలుదేరిన సంగతి తెలిసిందే. కానీ ధావన్ భారత జట్టుతో కివీస్‌కు బయలుదేరలేదు. దీంతో కివీస్ టీ20 సిరీస్ నుంచి గబ్బర్ దూరమవ్వడం దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది. ఆసీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో ధావన్‌కు గాయమైంది. ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన అతడు ఐదో ఓవర్లోనే నిష్క్రమించాడు. ఫించ్ కొట్టిన షాట్‌ను డైవ్ చేస్తూ ఆపే క్రమంలో అతడి ఎడమ భుజానికి గాయమైంది. దీంతో ఛేదనలో అతడు బ్యాటింగ్‌కు దిగలేదు. ఎక్స్‌రేకి వెళ్లొచ్చాక ధావన్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఎడమచేతికి కట్టుతో కనిపించాడు. అంతకుముందు రెండో వన్డేలో కూడా గబ్బర్ గాయపడ్డాడు. వేలి గాయంతో ప్రపంచకప్ నుంచి అతడు అర్ధంతరంగా నిష్క్రమించిన సంగతి తెలిసిందే. కోలుకున్నాక ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా గాయపడ్డాడు. మళ్లీ ఇప్పుడు మరోసారి గాయంతో జట్టుకు దూరమవనున్నాడు. కివీస్ టీ20 సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషభ్ పంత్, శివమ్ దూబే, కుల్‌దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, నవదీప్ సైని, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్
కివీస్ టూర్‌కు ధవన్ దూరం
RELATED ARTICLES