కార్మికులకు అన్యాయం

జూలై 3న ‘నిరసన’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనికార్మిక నేతల పిలుపు

ప్రజాపక్షం / హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 3న దేశవ్యాప్తంగా చేపడుతున్న ‘నిరసన’ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. కార్మిక, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ‘ఆన్‌లైన్‌ బహిరంగ సభ’ను నిర్వహించారు. ఈ సందర్భం గా ఎఐటియుసి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వి.ఎస్‌.బోస్‌ మాట్లాడుతూ గడిచిన ఆరు సంవత్సరాల్లో కేంద్ర ప్రభు త్వం 44 కార్మిక చట్టాల సవరణతో నాలుగు కోడ్‌లుగా నిర్ణయించి, కార్మికులకు అన్యాయం చేసిందని విమర్శించారు. యజమానులకు, బడాపెట్టుబడి దారులకు లాభాలు చేకూర్చే పద్ధతుల్లోనే చట్టాల సవరణకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కార్మికుల పట్ల ఏ మాత్రం సానుకూల దృక్పథం లేదన్నా రు. కార్మికులు దాచుకున్న డబ్బులను కూడా ప్రై వేటు వ్యక్తులకు కట్టబెట్టడంతో పాటు ఆ పిఎఫ్‌పై వస్తు న్న వడ్డీ ధరలను తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని చె ప్పారు. గడిచిన ఆరు సంవత్సరాల్లో రూ. 40 లక్షల కో ట్లు ఉన్న అప్పులను రూ. 80 లక్షల కోట్లకు తీసుకొచ్చారని వివరించారు. ప్రజలు అనేక పోరాటాల ద్వారా ఏ ర్పాటు చేసుకున్న ప్రభుత్వరంగ సంస్థలైన బిబీఎస్‌ ఎన్‌ఎల్‌, రైల్వే, రక్షణ లాంటి రంగాలను కేంద్రం పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు చూస్తోందని విమర్శించారు. ఇప్పటికే సింగరేణి, రక్షణ రంగానికి చెందిన కార్మికులు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమాలకు సిద్ధమయ్యారని తెలిపారు. ఈ రంగాలను ప్రైవేటుపరం చేయడం ద్వారా జాతి సంపదను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. జూలై 3న అన్ని రంగాల కార్మికులు నిరసన తెలిపేందుకు ముందుకు రావాలని కోరా రు. ఐఎన్‌టియుసి రాష్ర్ట ఉపాధ్యక్షులు విజయ్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు కార్మిక హక్కులను పట్టించుకోవటం లేదని ఆరోపించారు. కార్మికుల హక్కులను హరించాలని చూస్తే ప్రభుత్వాలకు తగి న గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సిఐటియు రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడిన గత ప్రభుత్వాలకు కార్మికులు తగిన బుద్దిచెప్పారన్నారు. లక్షలాది మంది వలస కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నప్పటి కీ కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపించారు. హెచ్‌ఎంఎస్‌ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఉదయ్‌ భాస్కర్‌ రావు, ఐఎఫ్‌టియు రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, టిఎన్‌టియుసి రాష్ర్ట కార్యదర్శి ఎం.కె బోస్‌, ఐఎప్‌టియు రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌, ఎఐయుటియుసి హైదరాబాద్‌ నాయకులు బాబూరావు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ర్ట అధ్యక్షులు కె నాగేశ్వరరావు, ఎఐబిఇయు రాష్ర్ట కోశాధికారి జానకి రాములు, డిఫెన్స్‌ రంగం జి.టి.గోపాల్‌ రావు, ఇన్సూరెన్సు నుండి రాజు, దక్షిణమధ్య రైల్వే (ఎస్‌సిఆర్‌) మజ్దూర్‌ యూనియన్‌ రాష్ర్ట కార్యదర్శి కె.శివకుమార్‌, ఫార్మా రంగం నుండి రాజుభట్‌ తదితరులు ప్రసంగించారు. ఈ ఆన్‌లైన్‌ బహిరంగ సభకు ఎఐటియుసి రాష్ర్ట అధ్యక్షులు ఎస్‌.బాలరాజ్‌, రాష్ర్ట కార్యదర్శి ఎం.నరసింహ, సిఐటియు రాష్ర్ట కార్యదర్శి జె.వెంకటేష్‌ అధ్యక్షత వహించారు. కాగా ‘ఆన్‌లైన్‌ బహిరంగ’ సభలో వాట్సాప్‌, ఫేస్‌ బుక్‌, యూ ట్యూబ్‌ ద్వారా 89 వేల మంది కార్మికులు, ప్రజలు వీక్షించినట్టు వారు ప్రకటించారు. సిఐటియు రాష్ర్ట కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ సభకు వందన సమర్పణ చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?