వెయిట్ లిఫ్టింగ్‌లో రజతం, కాంస్యం
55 కిలోల విభాగంలో పతకం సాధించిన సంకేత్ సర్గార్
61 కేజీలో విభాగంలో గురురాజ్ పూజారికి కాంస్య పతకం
బర్మింగ్ : ఇంగ్లాండలో జరుగుతున్న కామెన్వెల్త్ గేమ్స్‌లో భారత్ బోణి కొట్టింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో ఏకంగా రెండు పతకాలను సాధించింది. 55 కిలోల విభాగంలో సంకేత్ మహదేవ్ సార్గర్ రజత పతకం అందుకోగా.. 61 కిలోలో విభాగంలో గురురాజ్ పూజారి కాంస్య పతకం సాధించాడు. వెయిట్‌లిఫ్టర్ సంకేత్ సర్గార్ 55 కిలోల విభాగంలో రజత పతకం గెలుచుకున్నాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో 135 కిలోలు, స్నాట్చ్‌లో 113 కిలోలు ఎత్తాడు. మొత్తం 248 కిలోలు ఎత్తి రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో మొదటి ప్రయత్నంలో 135 కిలోలు ఎత్తిన సర్గార్.. మిగిలిన రెండు ప్రయత్నాల్లో 139 కిలోలను ఎత్తలేకపోయాడు. ఇక మలేషియాకు చెందిన బిన్ మహమద్ అనిఖ్ కేవలం ఒకే ఒక్క కిలో అదనంగా ఎత్తి స్వర్ణ పతకం ఎగరేసుకుపోయాడు. స్నాచ్‌లో 107 కిలోలను మాత్రమే ఎత్తిన అనిఖ్.. క్లీన్ అండ్ జెర్క్‌లో మాత్రం 142 కిలోలను ఎత్తాడు. దీంతో మొత్తం 249 కిలోల బరువును మోసి గోల్డ్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంకకు చెందిన దిలాంక ఇసురు కుమార యోదగె 225 కిలోలతో (స్నాచ్ -105, క్లీన్ అండ్ జెర్క్ – 120) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు. 61 కిలోల విభాగంలో కాంస్య పతంకం అందుకున్న గురురాజ్.. మొత్తం 269కిలోల (118 కిలోలు+151 కిలోలు) బరువును ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు. అతడు 2018 కామన్వెల్త్ క్రీడల్లో సిల్వర్ మెడల్ అందుకున్నాడు. ఇక ఈ విభాగంలో మలేసియాకు చెందిన అజ్నిల్ బిన్ బిడిన్ 285 కిలోలు ఎత్తి స్వర్ణం సాధించగా.. మొరియా బారు 273 కిలోల బరువు ఎత్తి రజతాన్ని సొంతం చేసుకున్నాడు. కాగా సంకేత్ కుటుంబ సభ్యులు కూడా వెయిట్ లిఫ్టర్లు కావడం విశేషం. దీంతో కుటుంబ వారసత్వాన్ని అతడు నిలబెట్టాడు. స్వర్ణం గెలవాలని ఎన్నో కలలు కన్నాడు. అందుకే స్నాచ్‌లో ఎలాంటి రిస్క్ చేయలేదు. వరుసగా 107, 111, 113 కిలోలు ఎత్తాడు. క్లీన్ అండ్ జర్క్‌లో తొలి పర్యాయంలోనే 135 కిలోలు ఎత్తాడు. దీంతో మొత్తం
బరువును 248 కిలోలకు పెంచాడు. అయితే అతడి మోచేయి బెణకడంతో మూడో లిఫ్ట్‌కు వచ్చి బరువు మోసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఒకవేళ మోచేతి గాయం కాకుండా ఉంటే సంకేత్ స్వర్ణం సాధించి తన కలను సాకారం చేసుకునేవాడు.
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ బోణీ
RELATED ARTICLES