137 ఏళ్ళ చరిత్రలో ఓటింగ్ ఆరోసారి
9,000 మంది ప్రతినిధుల తీర్పు నేడే
న్యూఢిల్లీ : కాంగ్రెస్‌పార్టీలో ఇందిరాగాంధీ కుటుంబవారసులు పోటీలో లేని అధ్యక్షపదవి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సోమవా రం ఉదయం పది గంటలకు దేశవ్యాప్తంగా పిసిసి కార్యాలయాల వద్ద కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, బాల్యం నుండీ కాంగ్రెస్‌పార్టీకి విధేయుడుగా ఎదిగిన దళితనాయకుడు మల్లికార్జున ఖర్గే (80), జి
ఎన్నికకు రంగం సిద్ధం తిరుగుబాటు బృందంలోని సీనియర్ నాయకుడు శశిథరూర్ మధ్య ప్రధానంగా ఈ పోటీ జరుగుతుంది. మూడో అభ్యర్థి త్రిపాఠి ఉన్నప్పటికీ ఆయన నామ మాత్రంగానే మిగిలారు. గుల్బర్గాజిల్లాలో న్యాయవిద్య అభ్యసించిన ఖర్గే కిందిస్థాయి నుండి పార్టీలో క్రమంగా ఎదుగుతూ వచ్చారు. 50 ఏళ్ళ రాజకీయ జీవితంలో తొమ్మిదిసార్లు ఆయన ఎంఎల్‌ఎల గెలిచారు. అమెరికా మసాచ్యుసెట్స్‌లో న్యాయవిద్య చదివిన శశిథరూర్ 1978లో పిహెచ్‌డి పూర్తి చేశారు. 9,000 మంది ప్రతినిధులు ఈ ఓటింగ్‌లో పాల్గొంటారు. ఈ బ్యాలట్ బాక్సులను ఓటింగ్ పూర్తికాగానే ఢిల్లీకి తరలిస్తారు. ఈనెల 19వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. కాంగ్రెస్ కుటుంబం మెచ్చిన ఖర్గే అప్రకటిత అధికారిక అభ్యర్థిగా తెరమీదకు వచ్చారు. 24 ఏల్ళ తరువాత మొదటిసారి ఇందిర కుటుంబ వారసులు అధ్యక్షపదవి పోటీలో లేకపోవడంతో దేశవిదేశాల్లో ఈ ఎన్నికను అంతా ఆసక్తిగా చూస్తున్నారు.137 ఏళ్ళ కాంగ్రెస్‌పార్టీ చరిత్రలో ఈ విధంగా ఆ పార్టీలో ఈ విధంగా పోటీ పోటీగా ఎన్నికలు జరగడం ఇది ఆరోసారి. ఎఐసిసి కేంద్ర కార్యాలయంతోపాటు దేశవ్యాప్తంగా 65 ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఎఐసిసి కేంద్ర కార్యాలయంలోనే ఓటు వేస్తారు. ప్రస్తుతం కర్ణాటకలో భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్‌గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్‌లు బళ్ళారిజిల్లాలోని సంగనకల్లులోనే ఓటింగ్‌లో పాల్గొంటారు.రాహుల్‌తోపాటు యాత్రలో పాల్గొంటున్న మరో 40 మంది ముఖ్యులు కూడా అక్కడే ఓట్లు వేస్తారు. జోడోయాత్రలో ఉన్న జైరామ్ రమేశ్ సోమవారం ఓటింగ్‌పై మాట్లాడుతూ, అత్యున్నతమైన అధ్యక్షపీఠం ఎవకి దక్కుతుదన్న విషయంలో కాంగ్రెస్ ఓటర్లు తమదైన ఏకాభిప్రాయంతో తీర్పు చెబుతారని అన్నారు. ఈ ఎనికల ప్రక్రియతో తమ పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. జోడో యాత్రతో భారత రాజకీయాల్లో గొప్ప మార్పులు వస్తాయన్నారు. ఒకవేళ అప్రకటిత అభ్యర్థి ఖర్గే గెలిస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న సోనియా కుటుంబం ఓటమి చెందినట్లేనని ఒక వర్గం విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన గెలుపు ముందస్తు నియామకమే కాగలదని వారు పేర్కొన్నారు
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధం
RELATED ARTICLES