HomeNewsBreaking Newsకలగా సొంతింటి నిర్మాణం

కలగా సొంతింటి నిర్మాణం

గృహ నిర్మాణాలకు ధరాఘాతం
పెరిగిన ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు
చుక్కలనంటిన స్టీలు, సిమెంట్‌ రేటు
ఆకాశానికి ఎగబాకిన ఇసుక, కంకర ధరలు
రెండు నెలల్లోనే 50 శాతం పెరుగుదల
అంచనాలు పెరిగి అయోమయంలో బిల్డర్లు
ప్రజాపక్షం/వరంగల్‌ సామాన్యులు, మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కల.. ఇక కలగానే మిగిలిపోయేట్టు కనిపిస్తోంది. గడిచిన రెండునెలల్లోనే స్టీలు, సిమెంట్‌, ఇతరత్రా సామగ్రి ధరలు అనూహ్యంగా 50 శాతం పెరగడంతో వ్యక్తిగత ఇల్లు, అపార్టుమెంట్ల నిర్మాణం ఖర్చు తడిసి మోపడై మోయలేనంత భారంగా మారింది. నిర్మాణం వ్యయం రెండింతలు అధికం కావడంతో సామాన్యులు, అపార్టుమెంట్ల వెంచర్లను చేపట్టిన బిల్డర్లు తలలు పట్టుకుంటున్నారు. అన్ని రకాల నిర్మాణ సామా గ్రి ధరలు పెరగడంతో ఇండ్ల నిర్మాణ పనులను నిలిపివేస్తున్నారు. దీంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కరువవుతోంది. సిమెంట్‌, ఇసుక, స్టీల్‌ తదితర ధరలు గణనీయంగా పెరిగినందుకు నిరసనగా క్రెడాయ్‌ (కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా) ఇటీవల ఒకరోజు బంద్‌ కూడా చేపట్టింది. వాస్తవానికి కరోనా కారణంగా రెండేళ్లుగా నిర్మాణ రంగం కుదేలైంది. కరోనా తగ్గి పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్న తరుణంలో ధరలు పెరగడం మరొక సమస్యగా మారింది. ఇల్లు కట్టాలంటేనే సామాన్యుడికి పట్టపగలే చుక్కలు కనిపిసున్నాయి. నిర్మాణ రంగంలో కీలకమైన సిమెంట్‌, స్టీల్‌, ఇసుకతో పాటు శానిటరీ వస్తువుల ధరలు 50 శాతం పెరిగాయి. రెండు నెలల కిందట టన్ను స్టీలు ధర రూ.45 వేలు ఉండగా, ప్రస్తుతం రూ.85 వేలకు పెరిగింది. బస్తా (50 కిలోలు) సిమెంట్‌ ధర రూ.220 నుంచి రూ.440 ఎగబాకింది. కంకర ధర ట్రాక్టర్‌ (100ఫీట్లు) రూ.2400 నుంచి రూ.3400 చేరుకున్నది. గృహ నిర్మాణానికి అవసరమైన ఇసుక ధర 30శాతం పెరిగింది. ఇళ్ల లో గోడలకు వేసే పెయింటింగ్‌ ధరలు కూడా 30 శాతం మేరకు పెరిగాయి. 20 లీటర్ల డబ్బా రూ.1600 నుంచి రూ.1800లకు, ప్రీమియర్‌ రూ.2500 నుంచి రూ.2800కు పెరిగింది. వీటితోపాటు చెక్క, టైల్స్‌, గ్రానైట్‌.. ఇలా అన్ని రకాల సామగ్రి ధరలు పెరిగాయి. డీజిల్‌ ధరలు పెరగడంతో సామగ్రి రవాణా చార్జీలు సైతం వాహన యజమానులు పెంచేశారు. నిర్మాణ సామాగ్రిని తరలించేందుకు డీసీఎం, లారీ యజమానులు గతంలో కనీస చార్జి రూ.800లు వసూలు చేస్తే ప్రస్తుతం రూ.1600 తీసుకుంటున్నా రు. నిర్మాణంలో కీలకమైన విద్యుత్‌, ప్లంబింగ్‌ పైపుల ధరలు రెండింతలయ్యాయి. ఇంటి నిర్మాణంలో ఉపయోగించే ఎలక్ట్రికల్‌ వస్తువుల ధరలు 60శాతం పెరిగాయి. వైర్లు, స్విచ్లు, స్విచ్‌ బోర్డులు, విద్యుత్‌ దీపాలు, ప్యానెల్‌ బోర్డుల ధరలు పైకి ఎగబాకుతున్నాయి. ఇటుకల ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. గతంలో 12వేలకు వచ్చే 2వేల ఇటుక ఇప్పుడు 16వేలకు పైకి చేరుకుంది.
కంపెనీల సిండికేట్‌
మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టించి నిర్మాణ సామగ్రి కంపెనీలు, సరఫరాదారులు ధరలను పెంచుతున్నారు. సిమెంట్‌ కంపెనీలు ప్రతీ నెలా పది రోజుల పాటు ఉత్పత్తి, సరఫరా నిలిపివేస్తున్నాయి. దీంతో మార్కెట్లో ధరలు పెరిగేలా చేస్తున్నాయి. సిమెంట్‌ తయారీకి అవసరమైన ముడిపదార్థాలు దొరకడం లేదని, దీంతో ధరలకు అధిక ధరలకు కొంటున్నామని చెప్పి సిమెంట్‌ కంపెనీలు రేట్లు పెంచేశాయి. సిమెంట్‌ కంపెనీలు కూడా ఇదే మాట చెబుతున్నాయి. మొత్తానికి సిమెంట్‌, స్టీల్‌ సరఫరా చేసే కంపెనీలు సిండికేట్‌ అయి మూకుమ్మడిగా ధరలను విపరీతంగా పెంచేశాయి.
రెన్యూవల్‌), ఫీజులు, రిఫండబుల్‌, నాన్‌ రిఫండబుల్‌ డిపాజిట్ల మొత్తాన్ని పెంచేసింది. దీంతో ఇళ్ల నిర్మాణాలకు వినియోగించే గ్రానైట్‌, పాలరాయి (మార్బుల్‌), రాతి ఇసుక, భవన నిర్మాణాలకు ఉపయోగించే బెందే్‌డ గ్రానైట్‌ (రాతి), కంకర, చివరకు మొరం ధరలు కూడా పెరిగిన పరిస్థితి ఏర్పడింది.
నిలిచిన నిర్మాణాలు
ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.400కోట్ల పెట్టుబడితో దాదాపు 3వేలకుపైగా అపార్టుమెంట్ల నిర్మాణాలు వివిధ దశలో ఉన్నాయి. ఇవేకాకాకుండా వ్యక్తిగత ఇళ్ల నిర్మాణాలు మరో 25వేల వరకు ఉంటాయి. సిమెంట్‌, స్టీలు ధరలు పెరగడంతో ఇవన్నీ ప్రస్తుతం ఆగిపోతున్నాయి. వీటిని పూర్తిచేయడం తలకుమించిన భారం కావడంతో నిర్మాణ పనులకు విరామం ఇస్తున్నారు. ధరలు పెరగక ముందు ఒక డబుల్‌ బె్‌డ రూమ్‌ ఇంటి నిర్మాణానికి రూ.40-50లక్షల మధ్య రేటుతో డిపాజిట్లు తీసుకున్న బిల్డర్లు.. ఇప్పుడు నిర్మాణ వ్యయం దారుణంగా పెరగడంతో వాటిని ఎట్లా పూర్తిచేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటి ధరలకు వీటిని పూర్తి చేయలేరు. అలాగని ఒప్పుకున్న రేటుకు ఇవ్వలేమని చెప్పలేరు. విచిత్రమైన పరిస్థితిని బిల్డర్లు ఎదుర్కొంటున్నారు.
రోడ్డున పడనున్న కూలీలు
పెరిగిన ధరల నేపథ్యంలో కొద్ది నెలల పాటు నిర్మాణ పనులకు పూర్తిగా విరామం ఇవ్వాలనే ఆలోచనలో బిల్డర్లు ఉన్నారు. ఒక వేళ ఇదే జరిగితే భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డున పడే పరిస్థితి ఏర్పడనున్నది. ఉమ్మడి జిల్లాలో బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఒక్క వరంగల్‌ నగరంలోనే 20 నుంచి 25 వేల మంది వలస కార్మికులు ఉన్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని దయనీయ స్థితి వీరిది. నెలల తరబడి పనులు లేకపోతే వీరంతా పస్తులుండాల్సి వస్తుంది. ఇప్పటికే నిర్మాణ పనులు తగ్గి పనులు సరిగా దొరకడం లేదు. వాస్తవంగా వేసవి కాలంలోనే నిర్మాణ పనులు ఎక్కువగా, వేగంగా జరుగుతాయి. కానీ ధరాఘాతంవల్ల పనులు మందగించాయి. భవిష్యత్తులో పూర్తిగా నిలిచిపోతే తమ పరిస్థితి ఏమిటని భవన నిర్మాణ కార్మికులు ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments