వ్యవసాయంపై రాహుల్ కనీస పరిజ్ఞానం లేదు
కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్
ప్రజాపక్షం /వనపర్తి టౌన్ : తెలంగాణ రాష్ట్రానికి పలు సంక్షేమ పథకాలతోపాటు 14వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామాలను అభివృద్ధిలోకి తీసుకెళ్లేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణకు రూ. లక్ష 15 వేల కోట్లు విడుదల చేయ డం జరిగిందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ సింగ్ తెలిపారు. గురువారం బిజెపి ఎన్నిక ల ప్రచారంలో భాగంగా వనపర్తి అభ్యర్థి కొత్త అ మరేందర్ మద్దతుగా పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు రా జ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలను ఉ ద్దేశించి ఆయన ప్రసంగించారు. తెలంగాణ ము ఖ్యమంత్రి కెసిఆర్ ఓట్ల కోసం రాజకీయ చిచ్చు పెడుతున్నారన్నారు. కెసిఆర్ పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని ఈ ఎన్నికల్లో టిఆర్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి వ్యవసాయం పట్ల కనీస పరిజ్ఞానం కూడా లేదన్నారు. వ్యవసాయం ద్వారా ఉత్పత్తి అయ్యే ఆలుగడ్డలను ఫా ్యక్టరీ ద్వారా తయారు చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రజలు, నిరుద్యోగ యువత, ప్రత్యామ్నాయంగా బిజెపి వైపు చూస్తురన్నారని బిజెపి అధికారంలోకి వచ్చిన ఏ డాది లోపు లక్ష ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు రైతులకు రూ. 2 లక్షల రుణమాఫి, రూ. 5 లక్షల వరకు ఆరోగ్యబీమా కల్పిస్తామన్నారు. వనపర్తిలో బిజెపి అభ్యర్థి అమరేందర్ గెలిపిస్తే నియోజక వర్గంతో పాటు వనపర్తి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల అయా రాష్ట్రాలలో బిజెపి వరసగా విజయాలను సాధించడం జరుగుతుందని సుపరిపాలన ప్రజాసంక్షేమమే ధ్యేయంగా బిజెపి ఇరవై రెండు రాష్ట్రాలలో అధికారంలో కొనసాగుతుందన్నారు.