ఓటు హక్కుపై ప్రజా చైతన్యం

మున్సిపోల్స్‌పై కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ సూచన

ప్రజాపక్షం/హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రజలలో చైతన్యం తీసుకు రావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ వి. నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంత వాతావ రణంలో జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో హైదరా బాద్‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఇసి) కార్యాలయంలో సోమవారం నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లు, బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ, పోలింగ్‌ స్టేషన్లు, రిటర్నింగ్‌ అధికారుల విధులు తదితర అంశాలపై సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల ఎన్నికలతో పొలిస్తే పట్టణ ప్రాంత ఓటర్లు ఎక్కువగా ఎన్నికల్లో పాల్గొనడం లేదని, ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అభ్యర్థులకు ఎన్నికల గుర్తును కేటాయించే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, బ్యాలెట్‌ పేపర్‌ ముద్రణకు ముందు అభ్యర్థుల వివరాలు సరిగ్గా చూసుకోవాలని సూచించారు. పోలింగ్‌ స్టేషన్ల వారీగా ఓటరు జాబితాను రూపొందించని మునిసిపల్‌ కమిషనర్లు వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. పోలింగ్‌ రోజు ఓటేసే అభ్యర్థి చేతికి సిరా గుర్తు అంటించేటప్పుడు నిశితంగా పరిశీలించాలన్నారు. ప్రతి ఒక్క ఓటర్‌ వద్ద తప్పనిసరిగా కమిషన్‌ ప్రకటించిన గుర్తింపు కార్డులలో ఏదో ఒక గుర్తింపు కార్డును చూసిన తర్వాతే ఓటు వేసేందుకు అనుమతించాలని, పోలింగ్‌ కేంద్రాల్లో కనీస వసతులను కల్పించాలని నాగిరెడ్డి తెలిపారు. పోలింగ్‌ విధులను నిర్వర్తించే ఎన్నికల సిబ్బందికి రెండోవిడత శిక్ష ణ కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. పోలీసు అధికారులతో చర్చించి ప్రతి పోలింగ్‌ స్టేషన్‌/ పోలింగ్‌ కేంద్రం వద్ద పోలింగ్‌ రోజున ఉండబోయే బందోబస్తు వివరాలు నిర్ణయించాలని పేర్కొన్నారు. ఈ వీడి యో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకులు డాక్టర్‌ టి.ఎస్‌. శ్రీదేవి, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌ కుమార్‌ పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?