HomeEntertainmentCinemaఓటీటీలో రికార్డులు బ్రేక్‌ చేస్తున్న ‘మహారాజ’

ఓటీటీలో రికార్డులు బ్రేక్‌ చేస్తున్న ‘మహారాజ’

తమిళ వెర్సటైల్‌ యాక్టర్‌ విజయ్‌ సేతుపతి లీడ్‌ రోల్‌లో నటించిన మూవీ ‘మహారాజ’. ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకుంది. దర్శకుడు నితిలన్‌ స్వామినాథన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర ఏకంగా రూ.100 కోట్ల వసూళ్లతో దుమ్ము లేపింది. సినిమాను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పటికే స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా ఓటీటీలోనూ తన సత్తా చాటుతూ దూసుకెళ్తోంది. ‘మహారాజ’ చిత్రం 2024లోనే నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షింపబడ్డ సినిమాగా నిలిచింది. 18.6 మిలియన్‌ వ్యూస్‌తో ఈ సినిమా టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. మహారాజ చిత్రంలో అనురాగ్‌ కశ్యప్‌, మమతా మోహన్‌ దాస్‌, నటరాజ్‌, భారతీరాజా, అభిరామి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అజనీష్‌ లోక్‌నాథ్‌ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments