లక్నో: వెస్టిండీస్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ ఓటమి అంచున నిలిచింది. అఫ్గాన్ రెండో ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. అఫ్గాన్‌కు ఇప్పటి వరకు కేవలం 19 పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. సంచలన బౌలర్, బాహుబలి రాంకిన్ కార్న్‌వాల్ వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ చెలరేగి పోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లతో అఫ్గాన్‌ను ఇబ్బందుల్లోకి నెట్టిన కార్న్‌వాల్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా మూడు వికెట్లు పడగొట్టాడు. రోస్టన్ ఛేజ్ కూడా మూడు వికెట్లు తీయడంతో అఫ్గాన్ కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే ఏడు వికెట్లు కోల్పోవడం, ఆధిక్యం 19 పరుగులే కావడంతో అఫ్గాన్‌కు ఓటమి ఖాయమనే చెప్పాలి. అంతకుముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 277 పరుగులకు ఆలౌటైంది. శమర్ బ్రూక్స్ అద్భుత సెంచరీతో విండీస్‌ను ఆదుకున్నాడు. అఫ్గాన్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న బ్రూక్స్ 15 ఫోర్లు, సిక్సర్‌తో 111 పరుగులు చేశాడు. కాంప్‌బెల్ (55), వికెట్ కీపర్ డోరిచ్ 42 పరుగులు చేసి తనవంతు సహకారం అందించాడు. అఫ్గాన్ బౌలర్లలో అమిర్ హంజా ఐదు, కెప్టెన్ రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టారు.
కార్నివాల్ అరుదైన ఘనత
వెస్టిండిస్ ఆఫ్ స్పిన్నర్ రకీమ్ కార్నివాల్ అరుదైన ఘనత సాధించాడు. గురువారం భారత్‌లో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో రెండేళ్ల తర్వాత పది వికెట్లు తీసి తొలి స్ఫిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో రకీమ్ కార్నివాల్ ఈ ఘనత సాధించాడు. లక్నో వేదికగా ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు సాధించిన రకీమ్ కార్నివాల్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి కార్నివాల్ మొత్తంగా 10 వికెట్లు సాధించాడు. ఉపఖండంలో ఆడుతున్న రెండో టెస్టులో 10 వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా అరుదైన గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజాల రికార్డుని కార్నివాల్ బద్దలు కొట్టాడు. దీంతో పాటు విదేశాల్లో ఆడే టెస్టుల్లో పది అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన ఏడో విండిస్ స్పిన్నర్‌గా గుర్తింపు సాధించాడు. కార్నివాల్‌కు ముందు ఆప్ఘనిస్థాన్ స్పిన్నర్ అమీర్ హంజా తన టెస్టు అరంగేట్రంలో 5 వికెట్లు పడగొట్టాడు.
ఓటమి ముంగిట ఆఫ్ఘన్
RELATED ARTICLES