టోక్యో : భారత బాడ్మింటన్ స్టార్ పివి సింధు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం దిశగా మరో అడుగు ముందుకేసింది. గురువారం జరిగిన బాడ్మింటన్ మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో ఆమె డెన్మార్క్‌కు చెందిన బ్లిక్ ఫెల్ట్‌ను 21 21 తేడాతో ఓడించింది. వరుసగా మూడు విజయాలను సాధించిన ఆమె క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టడం ద్వారా అభిమానుల ఆశలను పెంచింది. బ్లిక్ ఫెల్ట్‌ను గతంలో నాలుగు పర్యాయాలు ఢీకొన్న సింధు కేవలం ఒకసారి మాత్రమే పరాజయాన్ని చూసింది. మిగతా అన్ని సందర్భాల్లోనూ ఆమె విజయాలను తన ఖాతాలో వేసుకుంది. సతీష్ ముందంజబాక్సింగ్లో మేరీ కోమ్ పరాజయాన్ని ఎదుర్కోగా, పురుషుల విభాగంలో ఆర్మీ అధికారి సతీష్ కుమార్ నాకౌట్ ఫైట్‌ను విజయవంతంగా ముగించి క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. 91 కేజీల సూపర్ హెవీవెయిట్ విభాగంలో రికార్డో బ్రౌన్ (జమైకా)ని ఢీకొన్న సతీష్ అద్భుతమైన పంచ్‌లు, లోయర్ కట్, అప్పర్ కట్లతో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టాడు. పోరు హోరాహోరీగా సాగినప్పటికీ, చివరికి సతీష్‌నే విజయం వరించింది. భారత ఒలింపిక్స్ చరిత్రలో ఈ విభాగంలో భారత బాక్సర్ క్వార్టర్ ఫైనల్స్ చేరడం ఇదే మొదటిసారి. తొలిసారి ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన 32 ఏళ్ల సతీష్ అధికారులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. తర్వాతి రౌండ్లో అతనికి అతిపెద్ద సవాలు ప్రపంచ, ఆసియా చాంపియన్ బకొదిర్ జలొలొవ్ (ఉజ్బెకిస్తాన్) రూపంలో ఎదురుకానుంది.
పురుషుల హాకీలో విజయం
పురుషుల హాకీలో భాగంగా గురువారం డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు అత్యంత రక్షణాత్మక విధానాన్ని అనుసరించడంతో ఫస్ట్ హాఫ్‌లో ఒక్క గోల్ కూడా నమోదుకాలేదు. అయితే, సెకండ్ హాఫ్ 43వ నిమిషంలో భారత ఆటగాడు వరుణ్ కుమార్ ఈ డెడ్‌లాక్‌ను ఛేదించి, భారత్‌కు గోల్‌ను అందించాడు. మరో ఐదు నిమిషాల్లోనే అర్జెంటీనా తరఫున షుట్ కాసెల్లా గోల్ చేసి, ఈక్వెలైజర్‌ను సాధించడంతో భారత్ కంగుతిన్నది. ఆ వెంటనే కోలుకొని, ప్రత్యర్థి గోల్ పోస్టుపై ముమ్మర దాడులు నిర్వహించింది. 58వ నిమిషంలో సాగర్ ప్రసాద్ చేసిన గోల్‌తో ఆధిక్యాన్నికి దూసుకెల్లిన భారత్‌కు మరో నిమిషం తర్వాత హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ సాధించిపెట్టాడు. 3 అందుకున్న తర్వాత భారత్ వ్యూహాత్మకంగా ఆడి, అర్జెంటీనాకు గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా, విజయాన్ని నమోదు చేసింది.
ఒలింపిక్స్ మహిళల బాడ్మింటన్ క్వార్టర్స్‌కు సింధు
RELATED ARTICLES