HomeNewsBreaking Newsఒబిసి, ఇబిసిలే63

ఒబిసి, ఇబిసిలే63

పాట్నా: బీహార్‌లో ఎంతో కాలంగా వేచి చూస్తున్న కులాల వారీగా లెక్క తేలింది. నితీశ్‌ కుమార్‌ ప్రభు త్వం సోమవారం కులగణన సర్వే నివేదికను విడుద ల చేసింది. రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 63 ఒబిసిలు, ఇబిసిలు ఉన్నట్లు తేల్చింది. గణాంకాలను రాష్ట్ర అభివృద్ధి కమిషనర్‌ వివేక్‌ సింగ్‌ పాట్నాలో విడుదల చేశారు. రాష్ట్రం మొత్తం జనాభా 13.6 కోట్లుగా ఉంది. అందు లో అత్యంత వెనుకబడిన తరగతుల వారు 36 ఇతర వెనుకబడిన తరగతుల వారు 27.13 ఉన్నారు. కులాల వారీగా చూస్తే ఒబిసిలకు చెందిన యాదవులు అత్యధికంగా ఉన్నారు. వారి జనాభా 14.27 శాతంగా ఉంది. దళితులు (ఎస్‌సి) 19.65 మంది, ఎస్‌టిలు దాదాపు 22 లక్షల (1.68 మంది ఉన్నారు. అదే విధంగా జనరల్‌ కేటగిరీకి చెందిన వారు సంఖ్య 15.52 ఉంది. మతాల వారీగా చూస్తే రాష్ట్రంలో హిందువులు అధికంగా ఉన్నారు. వారి జనాభా 81.99 ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు. ముస్లింలు 17.70 శాతం మంది ఉన్నారు. ఇక మొత్తం జనాభాలో క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు ఒక శాతంగా కంటే తక్కువగా ఉన్నా రు. కల గణన సర్వేను నిర్వహించిన అధికారులను ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ అభినందిస్తూ ఒక ప్రకటనను విడుదల జేశారు. రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం కలిగిన తొమ్మిది రాజకీయ పార్టీలతో త్వరలో సమావేశాన్ని చేస్తానని, కులగణన సర్వే నివేదికను వారి ముందు ఉంచుతానని చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా చేపట్టే కులగణనకు దోహదపడుతుందని, ఆ జాబితాను తదుపరి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయంలో పరిగణనలోకి తీసుకుంటామని ఆర్‌జెడి చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూడా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం వీలుకాదని కేంద్రం ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో తమ రాష్ట్రంలో ఈ ప్రక్రియ చేపడతామని బీహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ గత ఏడాది జూన్‌లో ప్రకటించారు. ఈ ఏడాది జనవరిలో కులాలవారీగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 38 జిల్లాల్లో, రెండు దశల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే, కులగణను వ్యతిరేకిస్తూ పాట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయస్థానం వాటిని కొట్టివేస్తూ సర్వేకు అనుమతించింది. దీంతో ఈ విషయం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం ఈ అంశం సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉంది.

బీహార్‌ కులగణనలో కీలక అంశాలు
మొత్తం జనాభా:
13.07 కోట్లు
సామాజిక వర్గాలు: 215
అత్యంత వెనుకబడిన వర్గాలు (ఇబిసి): 36%
ఇతర వెనుకబడిన వర్గాలు (ఒబిసి): 27.13%
అత్యధిక జనాభాగల ‘టాప్‌ 10’ కులాలు…

  1. యాదవ్‌ (1.86 కోట్లు), జనాభాలో 14.27%
  2. దుషాద్‌ (69.43 లక్షలు), జనాభాలో 5.31%
  3. ఛామర్‌ (68.69 లక్షలు), జనాభాలో 5.25%
  4. కొయిరిస్‌ (55.06 లక్షలు), జనాభాలో 4.2%
  5. ముషార్‌ (40.35 లక్షలు), జనాభాలో 3.08%
  6. బ్రాహ్మిన్‌ (47.81లక్షలు), జనాభాలో 3.65%
  7. రాజ్‌పుత్‌ (45.10 లక్షలు), జనాభాలో 3.45%
  8. కుర్మీస్‌ (37.62 లక్షలు), జనాభాలో 2.87%
  9. బనియా (30.26 లక్షలు), జనాభాలో 2.3%
  10. కాయస్థ (7.87 లక్షలు), జనాభాలో 0.60%
    అత్యంత తక్కువ జనాభాగల 10 కులాలు
  11. ధరమి (312), 2. ఖోండ్‌ (303), 3. ఖేల్తా (246), 4. పహిరా (226), 5. ఢెకారూ (190), 6. హో (143), 7. సౌతా (107), 8. కొర్కు (102), 9. జడుపటియా (93), 10. భస్కర్‌ (37).
DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments