6,526 చేరిన కొవిడ్-19 పాజిటివ్‌లు
రాష్ట్రంలో మరో ముగ్గురు మరణం
ప్రజాపక్షం/హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మరంత భయపెడుతోంది. ఈసారి ఒక్కరోజే ఏకంగా 499 కొవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే రికార్డు. అలాగే కొత్తగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయా రు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 198కి చేరింది. రాష్ట్రంలో కేసుల సంఖ్య ఇప్పటికే ఆరువేల మార్కు దాటిన విషయం తెల్సిందే. శుక్రవారం నమోదైన 499 కేసుల్లో జిహెచ్ఎంసి పరిధిలోనే 329 పాజిటివ్లను గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్ కాకుండా దాన్ని ఆనుకొని వున్న రంగారెడ్డి జిల్లాలో కొత్తగా రికార్డు స్థాయిలో 129 కేసులు నమోదయ్యాయి. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కొత్తగా 4 కేసులు నమోదు అయ్యాయి. ఇవి కాకుండా, జనగామ జిల్లాలో 7, మహబూబ్‌నగర్ జిల్లాలో 6, మంచిర్యాల, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో 4 కేసులు చొప్పున నమోదయ్యాయి. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో రెండేసి కేసులు, సంగారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. వలసలు, ప్రవాసులకు సంబంధించి తాజాగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఇదిలావుండగా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 6,526కి పెరిగిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తన హెల్త్ బులిటెన్‌లో ప్రకటించింది. కరోనా వైరస్ సోకిన వారిలో ఇంకా 2976 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 3352 మందిని డిశ్చార్జి చేసినట్లుగా వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. శుక్రవారంనాడు 51 మందిని డిశ్చార్జి చేసినట్లు తెలిపింది.
ఒక్కరోజే 499 కేసులు!
RELATED ARTICLES