HomeNewsBreaking Newsఒకే రోజు క్యాబినెట్‌ టిఆర్‌ఎస్‌ఎల్‌పి భేటీ

ఒకే రోజు క్యాబినెట్‌ టిఆర్‌ఎస్‌ఎల్‌పి భేటీ

పెన్షన్లు, పోడు భూములు తదితరాలపై చర్చ

ప్రజాపక్షం / హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో సెప్టెంబర్‌ 3వ తేదీన సాయంత్రం 5 గంటలకు టిఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. అదే రోజు ప్రగతిభవన్‌లో క్యాబినెట్‌ సమావేశం అనంతరం టిఆర్‌ఎస్‌ఎల్‌పి సమావేశాన్ని నిర్వహించాలని టిఆర్‌ఎస్‌ అధినేత , ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన సాగే ఈ సమావేశంలో ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా, రాష్ర్టంలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, నూతనంగా అమలు చేస్తున్న పెన్షన్లు, గిరిజనులకు పోడు భూములు,తదితర అంశాలపై సమావేశం చర్చించనున్నట్లు సీఎంఒ వర్గాలు తెలిపాయి. వినాయకచవితి శుభాకాంక్షలుః వినాయక చవితి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు రాష్ర్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, భక్తి శ్రద్ధలతో హిందువులు గణనాథున్ని ఆరాధిస్తారని సీఎం కేసీఆర్‌ అన్నారు. జ్ఞానం, లక్ష్య సాధన, నైతిక విలువలు, ప్రకతి పరిరక్షణ వంటి సుగుణాలను వినాయక చవితి పండుగ మనకు నేర్పుతుందని సిఎం అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా శాంతి సౌభ్రాతత్వాలు వెల్లి విరిసేలా,ఆనందంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎవరెన్ని ఆటంకాలు సష్టించినా వాటిని వినాయకుని దీవెనలతో అధిగమిస్తూ, సకల జన సంక్షేమమే లక్ష్యంగా, రాష్ర్ట ప్రభుత్వం అభివద్ది సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని సిఎం అన్నారు. తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగేలా, సుఖ శాంతులతో జీవించేలా, దేశ ప్రజలందరికీ ఆ ఏకదంతుని దీవెనలు అందాలని సీఎం కేసిఆర్‌ ప్రార్థించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments