ప్రజాపక్షం /రుద్రంగి : రుద్రంగి మండల కేంద్రంలో అధికారులు కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించడానికి పర్యటిస్తుండగా గల్ఫ్ నుండి
గత 22వ తేదీ నాడు రుద్రంగి గ్రామానికి వచ్చిన శ్రీరాముల శంకర్ అనే వ్యక్తి అధికారులు చెప్పిన వినిపించుకోకుండా గ్రామంలో తిరుగుతున్నాడని ఉద్దేశంతో అతడిని అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఐసోలేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా మండల స్పెషలాఫీసర్ రాజారాం మాట్లాడుతూ శంకర్ కు ఆరోగ్య సమస్యలేమీ లేవని అతడు.క్వరైంటేయిన్ లో ఉండకుండా తిరుగుతున్నాడని ఉద్దేశంతోనే అతడ్ని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి గట్ల మీనయ్య,తహసీల్దార్ తఫాజుల్ హుస్సేన్,నాయకులు గంగం మహేష్,ఏఎన్ఎం రాజేశ్వరి,విఆర్ఓ నారాయణ తదితరులు ఉన్నారు
ఐసోలేషన్ వార్డుకు కు తరలింపు
RELATED ARTICLES