జిల్లాలు , జోన్లకు అనుగుణంగా ఐపిఎస్ అధికారులను కేటాయించాలి
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సిఎం కెసిఆర్ విజ్ఞప్తి
ప్రజాపక్షం / హైదరాబాద్ రాష్ట్రంలో పరిపాలన అవసరాల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలు, జోన్లకు అనుగుణంగా ఐపిఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. అదే మాదిరిగా క్యాడర్ సమీక్షను కూడా చేపట్టాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను సిఎం కెసిఆర్ శనివారం కలిశారు. ఈ సందర్భంగా సుమారు 45 నిమిషాల పాటు వారిరువురు సమావేశమయ్యారు. గతంలో ఉన్న 9 పోలీసు జిల్లాల సంఖ్య 20కి పెరిగిందని, పోలీసు కమిషనరేట్లు 2 నుంచి తొమ్మిదికి, 4 పోలీసు జోన్లు ఏడుకు పెరిగాయని కెసిఆర్ వివరించారు. రెండు పోలీసు మల్టీజోన్లు కొత్తగా ఏర్పాటయ్యాయన్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాల ఎస్పిలు, పోలీసు కమిషనర్లు, జోన్ ఐజిల సంఖ్య పెరగాల్సి ఉందని, కాబట్టి క్యాడర్ సమీక్ష నిర్వహించి పోస్టులు పెంచాలని కోరారు. 2016లో ఈ అంశంపై సమీక్షించిన కేంద్ర హోంశాఖ 76 సీనియర్ డ్యూటీ పోస్టులతో పాటు మొత్తం 139 పోస్టులను మంజూరు చేసిందని గుర్తు చేశారు. కొత్త జిల్లాల తరువాత పెరిగిన అవసరాలకు అనుగుణంగా సీనియర్ డ్యూటీ పోస్టులను 76 నుంచి 105కు పెంచాలని, మొత్తం పోస్టులను 195కు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన అంశాలను ప్రస్తావించారు.
ఐపిఎస్‌లను ఇవ్వండి
RELATED ARTICLES