70 స్థానల కోసం 1003 మంది పోటీ
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)కి ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజు ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2019 సీజన్లో మిగిలి ఉన్న 70 స్థానాల కోసం దరఖాస్తులను బిసిసిఐ అహ్వానించింది. దాని కోసం ఏకంగా 1003 మంది క్రీడాకారులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవడం విశేషం. బిసిసిఐ నిబంధనల ప్రకారం ఐపిఎల్ ఫ్రాంచైజీలు తమజట్టులో అట్టిపెట్టుకున్నా, అలాగే వదిలిపెట్టినా ఆటగాళ్ల జాబితాలను విడుదల చేయాలని గత నెలలో సూచించింది. ఈ నిబంధనల ప్రకారం ఫ్రాంచైజీలు తమతమ ఆటగాళ్లు పూర్తి జాబితాలను విడుదల చేశారు. ఎనిమిది ఫ్రాంచైజీలలో కలిపి మొత్తం 70 మంది క్రికెటర్ల భర్తీకి అవకాశం ఏర్పడింది. అయితే 70 మంది కోసం దరఖాస్తులను అహ్వానించగా.. మొత్తం 1003 మంది తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. అందులో 232 మంది విదేశీ క్రికెటర్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. దీన్ని బట్టి తెలుస్తోంది ఐపిఎల్‌కు మనదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఎంత క్రేజు ఉందో. ఈ లీస్ట్‌లో 200 మంది అంతర్జాతీయ క్రికెట్లో అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉండడం మరో విశేషం. వీరితోపాటు ఇంకా అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేయని 800 మంది ఆటగాళ్లు కూడా భారీ సంఖ్యలో రిజిస్టర్ చేసుకున్నారు. ఈ మొత్తం లిస్టులో భారత క్రికెట్‌కు చెందిన వివిధ రాష్ట్రాల క్రీడాకారులు746 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి దరఖాస్తులు చేసుకున్నారు.
ఐపిఎల్ క్రేజ్..
RELATED ARTICLES