ఏ ఆర్డర్‌లోనైనా బ్యాటింగ్‌కు సిద్ధమే

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ
ముంబయి : జట్టు అవసరాల కోసం నేను ఏ ఆర్డర్‌లోనైనా బ్యాటింగ్‌కు దిగుతానని, నాకు భయంమేమి ఉండదని అన్నాడు టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ. ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వావఖడే వేదికగా మంగళవారం తొలి వన్డే జరగనుంది. ఈ సందర్భంగా సారధి విరాట్‌ మీడియాతో మాట్లాడాడు. ’ఒక ఆటగాడు ఫామ్‌లో ఉంటే అది జట్టుకు మంచిది. ఎవరైనా అత్యుత్తమ జట్టు ఉండాలనే కోరుకుంటారు. అందులో నుంచి బెస్ట్‌ కాంబినేషన్స్‌తో బరిలోకి దిగాలనుకుంటారు. రోహిత్‌, శిఖర్‌, ధావన్‌ ఈ మ్యాచ్‌లో ఆడొచ్చు. ఈ నేపథ్యంలో ఎలాంటి సమతూకంతో మైదానంలోకి అడుగుపెడ్తామనే అంశంపైనే ఆసక్తి నెలకొననుంది. ’అని తొలి వన్డే నేపథ్యంలో జరిగిన మీడియా సమావేశంలో కోహ్లీ తెలిపాడు. లోయరార్డర్‌లో బ్యాటింగ్‌ చేయడానికి ఇష్టపడతావా అన్న ప్రశ్నకు ఏ ఆర్డర్‌లోనైనా ఆడేందుకు తనకు అభ్యంతరం లేదన్నాడు.’నా బ్యాటింగ్‌ ఆర్డర్‌పై నాకు అభద్రతా భావం లేదు. జట్టు అవసరాల మేరకు ఏ స్థానంలోనైనా ఆడేందుకు నేను సిద్ధం. ఇక కెప్టెన్‌గా అవసరమైన వేళ జట్టులో ఓ స్థానాన్ని భర్తీ చేసే స్థితిలో ఉండాలి. అది కెప్టెన్‌ భాధ్యత కూడా. చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోరు. జట్టును చూసుకోవడమే కెప్టెన్‌ పని కాదు. అందుబాటులో లేకున్నా జట్టు రాణించేలా కౠషి చేయాలి.’కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ఆసీస్‌తో డే/నైట్‌ టెస్టలకూ ..
భవిష్యత్‌లో మరిన్ని డే/నైట్‌ టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ సోమవారం స్పష్టం చేశాడు. మంగళవారం నుంచి ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ముందు ముంబయిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోహ్లీ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ ’భారత్‌లో మేం తొలి డే/నైట్‌ టెస్టు ఆడాము. ఆ మ్యాచ్‌ సాగిన తీరు ఆనందాన్ని కలిగించింది. ఏ టెస్టు సిరీస్‌కైనా అదొక(డే/నైట్‌) ప్రత్యేక ఆకర్షణగా మారింది. భవిష్యత్‌లో ఆ ఛాలెంజ్‌ను ఎదుర్కొనేందుకు మే సిద్ధం’ అని కోహ్లీ అన్నాడు. ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌వార్న్‌ ఈ సందర్భంగా ట్విటర్‌లో స్పందించాడు. ’ఈ విషయాన్ని నేను ముందే చెప్పాను. ఈ ఏడాది చివర్లో భారత్‌.. ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన్నప్పుడు 5 టెస్టుల సిరీస్‌ ఆడితే ఎంత బాగుంటుందో కదా? బ్రిస్బేన్‌, పెర్త్‌, అడిలేడ్‌(డే/నైట్‌), మెల్‌బోర్న్‌, సిడ్నీలో తలపడాలి. బీసీసీఐ, సీఏ దీన్ని నిజం చేయడానికి ముండడుగు వేయాలి. అయితే, ఇలా షెడ్యూల్‌ చేయడం కష్టమని చెప్పడం మాత్రం సరికాదు’ అని వార్న్‌ ట్వీట్‌ చేశాడు. అలాగే బీసీసీఐ, క్రికెట్‌ ఆస్ట్రేలియా, భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌పైన్‌తో పాటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీని ట్యాగ్‌ చేశాడు.

DO YOU LIKE THIS ARTICLE?