ఎల్జీ పాలిమర్స్‌కు సుప్రీంలో చుక్కెదురు

న్యూఢిల్లీ : విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫ్యాక్టరీని సీజ్‌ చేయాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఎల్జీ పాలిమర్స్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోబోమని, ఏ వాదనలనైనా హైకోర్టు, ఎన్జీటీ (నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌) ముందే వినిపించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఫ్యాక్టరీని సీజ్‌ చేయాలని హైకోర్టు ఏకపక్షంగా ఆదేశించిందని, ఎల్జీ ప్లాంట్‌లోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కంపెనీ తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గి విజ్ఞప్తి చేశారు.
DO YOU LIKE THIS ARTICLE?