రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తప్పుపట్టిన కేంద్రం
న్యూఢిల్లీ : అంతర్రాష్ట్ర జలవనరుల సమస్యలు పెరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం డిపిఆర్‌పై కేంద్ర జలశక్తిశాఖ అసంతృప్తి వ్యక్తంచేసింది. డిపిఆర్‌లో కనీస ప్రాథమిక అంశాలు లేవని అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ సంచాలకులు ముఖర్జీ తాజాగా ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌కు లేఖ రాశారు. మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం డిపిఆర్‌ను నవంబర్ 16న ఎలక్ట్రానిక్ విధానంలో, డిసెంబరు 3న ప్రతుల రూపంలో…. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించింది. డిపిఆర్ ప్రతులను పరిశీలించిన కేంద్ర జలశక్తిశాఖ… 46 పేజీల డాక్యుమెంట్లో కనీస ప్రాథమిక అంశాలైన.. హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర అంశాలు, ఇరిగేషన్ ప్లానింగ్, డిజైన్, కాస్ట్ఎస్టిమేట్ లేవని పేర్కొంది. సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నిర్ధారణ కోసం డిపిఆర్‌ను ప్రాథమిక ఆమోదముద్ర వేసే పరిస్థితి లేదని కేంద్రం పేర్కొంది. నీటిపారుదల, బహుళార్ధక ప్రాజెక్టుల డిపిఆర్‌ల తయారీ మార్గదర్శకాలు..కేంద్ర జలసంఘం వెబ్సైట్లో ఉన్నాయని.. వాటికి అనుగుణంగా సరైన డిపిఆర్‌ను రూపొందించి పంపాలని జల్‌శక్తి శాఖ కోరింది
ఎపి డిపిఆర్‌పై అసంతృప్తి
RELATED ARTICLES