మొదటి ప్రమాద హెచ్చరిక
భద్రాచలం వద్ద 44 అడుగుల వరద
ప్రజాపక్షం/భద్రాచలం
భద్రాచలం వద్ద గోదావరి వరద పెరుగుతోంది. 43 అడుగులు దాటి ప్రవహిస్తుండటంతో అధికారులు మొదటి ప్రమాదహెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 44 అడుగుల నీటి మట్టం నమోదైంది. గత ఐదు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండుకోవడంతో పాటు ఉపనదులు, వాంగులు , వంకలు పొంగి పొర్లి గోదావరిలో కలుస్తుండటంతో వరద తాకిడి పెరిగింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు భారీగా పడుతుండటంతో గోదావరికి మరింత వరద పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాగాల ఐదు రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు వాతావారణ శాఖ ఇప్పటికే వెల్లడించి. అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన అస్నా తుపాన ప్రభావం తెలంగాణాలో సైతం ఉండే అవకాశం ఉందని వార్తలు బలంగా వినవస్తున్నాయి.ఇదే జరిగితే గోదావరికి భారీ వరద ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ముంపుకు గురయ్యే గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. గడిచిన మూడు మాసాలుగా ఏజెన్సీ ప్రాంతం గోదావరి వరదలతో అతలాకుతలం అవుతోంది. రైతులకు భారీ నష్టం వాటిల్లింది. రైతు కూలీలు, కూలీలకు, చేతి వృత్తి దారులకు పనుల్లేక కుటుంబాల పోషణ కష్టంగా మారింది.
ఏ క్షణమైనా లోయర్ మానేరు డ్యామ్గేట్లు ఎత్తివేత
ఉత్తర తెలంగాణాలో అతిభారీ వర్ష సూచన కారణంగా ఏక్షణం లోనైనా లోయర్ మానేరు డ్యామ్ ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తి వేయనున్నట్లు అధికారులు తెలిపారు. డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతామని , ఈ క్రమంలో రెవిన్యూ, పోలీస్ శాఖ, ఇతర అధికారులు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవలసినదిగా కరీంనగర్ జిల్లాలోని వివిధ గ్రామాలలో దండోరా వేయించాల్సిందిగా ఎల్ఎండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. నాగభూషణ ఒక ప్రకటనలో అధికారులకు సూచించారు. నదీ పరివాహక ప్రాంతంలోకి పశువులు, గొర్రెలు, మేకలు మొదలగునవి వెళ్లకుండా చూడాలన్నారు. చేపలు పట్టే మత్యకారులు, గొర్రెల కాపరులతో పాటు రైతులు తగిన విధంగా అప్రమత్తం గా ఉండాలని కోరారు. లోయర్ మానేరు జలాశయం దిగువ పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయవలసిందిగా పోలీస్, రెవెన్యూ అధికారులకు ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
ఉప్పొంగుతున్న గోదావరి
RELATED ARTICLES