గోపేశ్వర్ (ఉత్తరాఖండ్): భారత్ చైనా సరిహద్దులోని చమోలీ ప్రాంతంలో సంభవించిన హిమపాతానికి పది మంది మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పలువురి జాడ తెలియడం లేదు. వారిని గుర్తించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ప్రమాదం శుక్రవారం చోటు చేసుకుందని అధికారులు ప్రకటించారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బిఆర్ఒ)కు చెందిన వర్కర్లు పని చేస్తుండగా, ఒక్కసారిగా ముంచుకొచ్చిన హిమపాతంలో వారు చిక్కుకుపోయారని తెలిపారు. 384 మందిని జవాన్లు కాపాడినట్టు అధికారులు ప్రకటించారు. బిఆర్ఒకు చెందిన రెండు లేబర్ క్యాంపులు దెబ్బతిన్నాయని, ఈ సంఘటనలో సుమారు 20 మంది జాడ తెలియడం లేదని వివరించారు. ఘటన జరిగిన వెంటనే ఆర్మీ రంగంలోకి దిగడంతో, భారీ ప్రాణనష్టం తప్పించదని అన్నారు. జాడ తెలియకుండాపోయిన వర్కర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
ఉత్తరాఖండ్లో హిమపాతం పది మంది దుర్మరణం
RELATED ARTICLES