రిశాట్ తొమ్మిది విదేశీ ఉపగ్రహాలను
విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో
హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటిన పిఎస్ఎల్వి సిరీస్
శ్రీహరికోట(ఆ.ప్ర.): రిమోట్ ఎర్త్ ఆబ్జర్వేషన్ ఉపగ్రహం(రిశాట్ ఇస్రో బుధవారం విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. దాంతోపాటు తొమ్మిది విదేశీ వాణిజ్య ఉపగ్రహాలను కూడా ప్రవేశపెట్టింది. స్పేస్‌పోర్ట్ నుంచి మధ్యాహ్నం 3.25 గంటలకు 44.4 మీటర్ల ఎత్తు ఉన్న పిఎస్ఎల్వి ఉరుము వంటి శబ్దంతో, పొగను చిముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. లిఫ్ట్‌ఆఫ్ అయిన 16 నిమిషాలకు రిశాట్ కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఐదు నిమిషాలకు మిగతా ఉపగ్రహాలను కూడా కక్ష్యలో ప్రవేశపెట్టింది. వీటిలో అమెరికాకు చెందిన ఆరు ఉపగ్రహాలు, ఇజ్రాయెల్, ఇటలీ, జపాన్‌లకు చెందిన ఒక్కో ఉపగ్రహం ఉన్నాయి. ఇప్పటి వరకు ఇస్రోకు అతిపెద్ద కస్టమర్ అమెరికానే. అమెరికాకు చెందిన 233 చిన్న ఉపగ్రహాలను రోదసి కక్ష్యలోకి ఇస్రో చేర్చింది. మొత్తం 10 ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టాక ఇస్రో చైర్మన్ కె శివన్ ఇతర శాస్త్రజ్ఞులను అభినందించారు. బుధవారం ప్రయోగించిన పిఎస్ఎల్వి ఈ సిరీస్‌లో 50 అంతరిక్ష వాహకనౌకలను ప్రయోగించినట్లుంది. తర్వాత ఆయన మిషన్ కంట్రోల్ సెంటర్లో మాట్లాడుతూ ‘ఇస్రో తన చారిత్రక మిషన్‌ను పూర్తి చేసింది…పిఎస్ఎల్వి 50వ వాహకం రిశాట్ 576 కిమీ. కక్ష్యలోకి ప్రవేశపెట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. క్లిష్టమైన రిశాట్ బిఆర్1ను అతి స్వల్ప కాలంలో రూపొందించడం జరిగింది. ఇందుకు కృషి చేసిన బృందానికి అభినందనలు’ అన తెలిపారు.