HomeNewsBreaking Newsఇవిఎంలలో అభ్యర్థుల భవితవ్యం !

ఇవిఎంలలో అభ్యర్థుల భవితవ్యం !

కౌంటింగ్‌కు ఇసి ముమ్మర ఏర్పాట్లు 
స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద 24/7 నిఘా
ఓట్ల లెక్కింపు కేంద్రాలలో 11న 144 సెక్షన్‌ 
ప్రజాపక్షం / హైదరాబాద్‌ 
ఓట్లు వేశారు.. ఇవిఎంలలోకి వెళ్లాయి.. తమ నేతలెవరో ఓటర్లు స్పష్టం చేశారు. వారెవరనేది ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తుంది. నేతల భవితవ్యాన్నంతా తనలో దాచుకున్న ఇవిఎంలు స్ట్రాంగ్‌ రూముల్లోకి చేరుకున్నాయి. అందరి దృష్టి ఓట్ల లెక్కింపుపై పడింది. అక్రమ మార్గాల్లో ఓటరు చెప్పిన తీర్పును మార్చకుండా ఉండేందుకు స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజక వర్గాల నుంచి రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 1821 మంది పోటీచేశారు. వీరిందరినీ ఎన్నుకునేందుకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2,80,64,684 మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. ఎన్నికల్లో సుమారు 72.6 వరకు పోలింగ్‌ శాతం నమోదైనట్లు అనధికారిక సమాచారం. చెదురు మదురు ఘటన మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.
ఒక్కో కేంద్రంలో రెండు మూడు నియోజక వర్గాల లెక్కింపు!
ఈ నెల 11న ఓట్ల లెక్కింపు కోసం అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి తెలిపారు. రెండు, మూడు నియోజక వర్గాల ఓట్లను ఒక కేంద్రంలో లెక్కింపు చేస్తా రు. ఇందుకోసం జిల్లాల్లో అగ్రికల్చరల్‌ మార్కెట్‌ గోదాములు, ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలు, గీతం యూనివర్సిటీ వంటి ప్రాంగణాలను కౌంటింగ్‌ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. పార్టీల ప్రతినిధులు, పోటీ చేసిన అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, మీడియా సమక్షంలో కౌంటింగ్‌ నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ తెలిపారు. ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల ఫలితాలతో పాటే తెలంగాణ ఫలితాలు కూడా 11నే వెలువడనుండడంతో రాజకీయ వర్గాల్లోనూ, రాష్ట్ర ప్రజానీకంలోనూ ఈ ఫలితాల పట్ల ఉత్కంఠ నెలకొంది.
స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద 24/7 నిఘా  : రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన వివి ప్యాట్‌, ఇవిఎంలులతో కూడిన స్ట్రాంగ్‌ రూమ్‌లు పోలీసు నీడలో ఉన్నాయి. ఇక్కడ 24 గంటలు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మొత్తం 31 జిల్లాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్దనే స్ట్రాంగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు డిజిపి ఎం.మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఇక్కడ పోలీసులు షిప్టుల వారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద 20 నుంచి 30 మంది సాయుధ బలగాల పోలీసులను వినియోగించారు. అలాగే సిసికెమెరాలను సైతం ఏర్పాటు చేశారు,. ఈ కెమెరాలను డిజిపి కార్యాలయంలోని కమాండ్‌కంట్రోల్‌ సెంటర్‌కు అనుసందానం చేశారు. దీంతో స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద 24 గంటలు నిఘా ఉంటుంది. ప్రతి క్షణం కూడా సిసికెమెరాలో వీడియో నిక్షిప్తం అవుతుంది.స్ట్రాంగ్‌ రూమ్‌లోకి ఎవరు వెళ్లకుం డా.. అక్కడ పరిస్థితిని ప్రతి క్షణం గమనించేందుకు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో సిబ్బంది టివి తెర పై గమనిస్తుంటారు. మావోయిస్టుల ప్రాభావిత ప్రాతాలలో స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద అదనపు బం దోబస్తు ఏర్పాటు చేశారు. ఇక 11న జరిగే ఓట లెక్కింపు సందర్భంగా ఈ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించారు. ఓట్ల లెక్కింపు రోజున ఒక్కో కేంద్రం వద్ద ఎస్‌పి స్థాయి అధికారి పర్యవేక్షణలో 500 మంది పోలీసులను బందోబ్తులో నియమిస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments