లీజు ముగిసినా స్వాధీనం చేసుకోని వైనం
ప్రైవేటు సంస్థల మాయాజాలం
బల్దియా ఆదాయానికి భారీ శఠగోపం
మొద్దునిద్రలో యంత్రాంగం.. తీరిక లేని ఉన్నతాధికారులు
ప్రజాపక్షం/హైదరాబాద్: లీజు భూములపై మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) మొద్దు నిద్ర వీడటం లేదు. కోట్లాది రూపాయాల విలువైన భూముల లీజు గడువు తీరిపోయినా స్వాధీనం చేసుకోవడంలో బల్దియా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అత్యంత విలువైన భూములు ఇంకా ప్రైవేట్ సంస్థల కబంధ హస్తాల్లోనే ఉన్నాయి. కొన్ని భూములకు సంబంధించిన రికార్డులు కూడా జిహెచ్ఎంసి దగ్గర లేకపోవడంతో విస్మయం కలిగిస్తోంది. రికార్డులు లేని భూములు ఇప్పటికే పరాధీనమయ్యాయని బల్దియా వర్గాలు పేర్కొంటున్నాయి. రికార్డులు లేని భూములను గుర్తించే పరిస్థితిలో బల్దియా అధికారులు లేకపోవడంతో సదరు లీజుదారులే వాటికి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి, విక్రయించినట్లు ప్రచారం జరుగుతోంది. అందుబాటులో ఉన్న భూములనైనా కాపాడుకోలేని దీన స్థితిలో బల్దియా యంత్రాంగం ఉంది. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం జిహెచ్ఎంసి దగ్గర 91 స్థలాలు లీజుకు ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి. మూడు నాలుగు దశాబ్దాల కిందట లీజుకు కేటాయించిన భూములకు చదరపు గజానికి సంవత్సరానికి కేవలం రూ.1 నుంచి రూ.5లోపే చెల్లిస్తున్నారు. భూములను స్వాధీనం చేసుకొని, ప్రస్తుత ధరలకు అనుగుణంగా లీజుకు కేటాయిస్తే కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతుంది. ఈ భూముల్లో నిర్మించిన భనాలు లీజు కాలం పూర్తయిన అనంతరం జిహెచ్ఎంసికే చెందుతాయి. భూములను స్వాధీనం చేసుకుంటే భవనాలు కూడా జిహెచ్ఎంసి వస్తాయి. ఈ క్రమంలో భవనాలను కూడా వ్యాపార, వాణిజ్య సముదాయాలు మార్చి, లీజుకు ఇస్తే జిహెచ్ఎంసి ఆర్థ్ధికంగా కొంత ఊరట కలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాటిని ప్రజాప్రయోజనాలు ఉపయోగించాలని నగర వాసులు కొరుతున్నారు. జిహెచ్ఎంసి సర్కిళ్ల సంఖ్య పెంచడంతో