ఉదయ్‌పూర్ : రాజస్థాన్‌లో ప్రజలు ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారని, డిసెంబర్ 7 తరువాత బిజెపి ప్రతిపక్షంలో కూర్చోవడం ఖాయమని పటిదార్ నేత హార్దిక్ పటేల్ అన్నారు. గుజరాత్‌కు చెం దిన పటేల్ ఇటీవల ఉదయ్‌పూర్‌లో పర్యటించారు. రాజస్థాన్‌లో బిజెపి ప్రభుత్వం ప్రజలకు నమ్మక ద్రోహం చే సిందని మండిపడ్డారు. ముఖ్యంగా ఉద్యోగాల సృష్టి పేరు తో యువతను దారుణంగా మోసం చేసిందన్నారు. రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో తాను సమావేశాలను ఏర్పాటు చేసి ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించానని హార్దిక్ చెప్పారు. ప్రస్తుతం ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయకుండా, కొత్త ఉద్యోగాలను కల్పించకుండా బిజెపి ప్రభుత్వం యువతను తీవ్రంగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశా రు. కాషాయ పార్టీకి ప్రతిపక్ష పాత్రే సరైందన్నారు. ఆ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. కేంద్రం, రాష్ట్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వాలు ప్రజలను ఓటు బ్యాంకు రాజకీయాల కు వాడుకుంటూ నమ్మక ద్రోహం చేశాయని ధ్వజమెత్తారు. కాగా, తాను కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారం చేయడం లేదని, అయితే కిసాన్ క్రాంతి సే న తరుపున రైతుల, గిరిజనుల, యువత సమస్యలను తెలుసుకునేందుకు ప్రజలతో భేటీ అవుతున్నాయని హార్దిక్ వెల్లడించారు.
ఇక బిజెపిది ప్రతిపక్ష పాత్రే : హార్దిక్
RELATED ARTICLES