కూలిపోయినట్లుగా అనుమానం
సముద్రంలో శకలాలు?
విమానంలో 62 మంది ప్రయాణికులు
జకార్తా : ఇండోనేషియాకు చెందిన బోయింగ్ 737- విమానం శనివారం టేకాఫ్ అయిన నాలుగు నిమిషాల వ్యవధిలోనే గల్లంతయింది. సుమారు 250 అడుగుల ఎత్తుకు వెళ్లిన తర్వాత బేస్‌తో సంబంధాలు తెగిపోయాయని, దీనితో విమానం జాడపై ఎలాంటి సమాచారం అందడం లేదని ఇండోనేషియా అధికారులు ప్రకటించారు. 160 కెపాసిటీగల ఈ బోయింగ్‌లో సిబ్బంది సహా మొత్తం 62 మంది ఉన్నట్టు తెలుస్తోంది. పలు ద్వీపాల సమూహమైన ఇండోనేషియాలో అదృశ్యమైన విమానం జాడలను తెలుసుకునేందుకు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఏదైనా నిర్జన ద్వీపంలో విమానం కూలిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 12.40 గంటలకు అదృశ్యమైన ఈ విమానం జాడపై ఇండోనేషియా ప్రభుత్వం ఎలంటి ప్రకటన చేయలేదు. జకార్తాలోని శ్రీవిజయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఎస్జే182గా పిలిచే ఈ బోయింగ్ మొట్టమొదటిసారి 1994లో గాల్లోకి ఎగిరింది. సుమారు 26 సంవత్సరాలుగా ఎంతో మందిని గమ్యాలకు చేర్చిన ఈ విమానం జకార్తా నుంచి
పొంటియానక్కు బయలుదేరిన కొన్ని నిమిషాల్లోనే మాయం కావడం పట్ల ఇంతోనేషియా ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. విమానం ఆచూకీ తెలుసుకునే ప్రక్రియ కొనసాగుతున్నదని ప్రకటించింది. ఏదైనా ప్రాంతంలో అది సురక్షితంగా దిగి ఉండవచ్చన్న ఆశాభావం వ్యక్తం చేసింది. విమానంలో ఎంత మంది ఉన్నదనే విషయాన్ని అధికారులు ఎవరూ ఇంకా ధ్రువీకరించలేదు.
సముద్రంలో శకలాలు? కనిపించకుండా పోయిన బోయింగ్ ఎస్జే182 విమానం శకలాలు సుమద్రంలో కనిపించాయని తెలుస్తున్నది. కొంత మంది మత్స్యకారులు ఈ విషయాన్ని తెలిపారని, ఆయితే, పూర్తి సమాచారం అందాల్సి ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి పిటిఐతో మాట్లాడుతూ చెప్పారు. కాగా, బోయింగ్ విమానాలు హఠాత్తుగా కూలిపోవడం ఇదే మొదటిసారి కాదు. 2018లో బోయింగ్ 737 మాక్స్ జెడ్ జకార్తా నుంచి ంచి తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే జావా సముద్రంలో కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న 189 మంది మృతి చెందారు. 1997లో గరుడ విమానం సుమత్రా ద్వీపానికి సమీపంలోని మెడాన్లో కూలిపోవడంతో, అందులోని 234 మంది దుర్మరణం పాలయ్యారు. 2014 డిసెంబర్లో ఎయిర్ ఏషియా విమానం సురబయా నుంచి సింగపూర్ బయలుదేరి సముద్రంలో కూలిపోయింది. ఫలితంగా అందులో ప్రయాణిస్తున్న 162 మంది మృతి చెందారు. ప్రస్తుత దుర్ఘటనలో 62 మంది మృతి చెంది ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.
ఇండోనేషియాలో విమానం అదృశ్యం
RELATED ARTICLES